హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భాను కిరణ్‌ను అరెస్టు చేయలేదు: సూరి హత్య కేసుపై ఎకె ఖాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

AK Khan
హైదరాబాద్‌: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో భాను కిరణ్‌ను అరెస్టు చేసినట్లు వచ్చిన వార్తలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎకె ఖండించారు. భాను కిరణ్‌ను అరెస్టు చేయలేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. భాను అక్కాబావలను విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. సూరి హత్య కేసులో 9 మంది పాత్రను గుర్తించినట్లు ఆయన తెలిపారు. మీడియాపై పోలీసు కమిషనర్‌ కొత్తగా ఆంక్షలేం విధించలేదని ఉన్న చట్టం ప్రకారమే ఆంక్షలు విధించామని ఆయన స్పష్టం చేశారు. హింసాత్మక ఘటనలు ప్రసారం చేయరాదని ఎన్‌ బీఏ నిబంధనలు, హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని కేబుల్‌ నియంత్రణ చట్టం ప్రకారం కూడా హింసాత్మక ఘటనలు ప్రసారం చేయరాదని అన్నారు.

సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకే కాక మీడియాకు బాధ్యత ఉండాలన్నారు. వార్తల ప్రసారంలో మీడియా బాధ్యతాయుతంగా మెలగాలన్నారు. హింసాత్మక ఘటనలు ప్రసారం చేసిన ఓ ఛానల్‌ కు ఈ రోజు నోటీసులు జారీ చేశామని మిగతా టీవీ ఛానళ్లను కూడా గమనిస్తున్నామని చెప్పారు. ఓయు వీసీకి మూడు లేఖలు రాశామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఓయు పేరు ప్రతిష్టలు దెబ్బతినకుండా చూడాలని కోరామన్నారు. భాను అరెస్టుపై ప్రశ్నించగా అతను తమ అదుపులో లేడన్నారు. గంపగుత్త మొబైల్ సందేశాలు పంపినవారిని గుర్తించామని, వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X