అవసరమైతే విస్తరణ, బొత్స మంచి మనసుతోనే లేఖలు: సిఎం

నామినేటెడ్ పోస్టుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసు ప్రభుత్వం గెలుపు సాధిస్తుందని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్సీల గెలుపు బాధ్యత మాత్రం ఆయా జిల్లాల మంత్రులదే అన్నారు. నా బాధ్యత ఉన్నప్పటికీ వారి పాత్ర ఎక్కువ అని చెప్పారు. త్వరలో డిప్యూటీ సిఎం, స్పీకర్ పదవులపై కూడా ఒ కొలిక్కి వచ్చే అవకాశముందని చెప్పారు. వ్యవసాయ శాఖమంత్రి వైయస్ వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఎమ్మెల్సీగా పోటీ చేస్తారా అనే విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయ మంచి సూచనలతో తనకు లేఖ రాశారని అందులో తప్పు పట్టాల్సిన పని ఏముందన్నారు.