వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పని మనిషిపై అత్యాచారం కేసులో హైకోర్టుకు వెళ్లనున్న షైనీ అహుజా

By Pratap
|
Google Oneindia TeluguNews

Shiney Ahuja
ముంబై: పని మనిషిపై అత్యాచారం కేసులో స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పును బాలీవుడ్ నటుడు షైనీ అహుజా బొంబాయి హైకోర్టులో సవాల్ చేయనున్నాడు. పని మనిషిపై అత్యాచారం కేసులో స్థానిక కోర్టు అహుజాకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే. సమ్మతితో పని మనిషిపై సెక్స్‌లో పాల్గొన్నానని, తాను అత్యాచారం చేయలేదని, తన ప్రతిష్టను దెబ్బ తీయడానికీ డబ్బుల కోసమూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన అంటున్నారు.

తమ ఇంటిలో పనిచేయడానికి అహుజా, అతని భార్య 2009లో 18 ఏళ్ల యువతిని తమ ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నారు. భార్య లేని సమయం చూసి అహుజా తనపై అత్యాచారం చేశాడని పని మనిషి గతంలో ఆరోపించింది. అరెస్టు చేసిన తర్వాత అహుజాకు డిఎన్ఎ పరీక్షలు నిర్వహించారు. అహుజా అత్యాచారానికి పాల్పడినట్లు ఈ పరీక్షల్లో తేలింది. 2009 అక్టోబర్‌లో అతనికి బెయిల్ లభించింది. తనపై అత్యాచారం జరపలేదని పనిమనిషి 2010లో మాట మార్చింది.

English summary
Just a day after Bombay High Court’s slapped seven years rigorous imprisonment on Shiney Ahuja for raping his domestic help, the actor plans to appeal against the directive of the apex court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X