వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడడమే కాదు.. పది టాప్ మైక్రో అప్లికేషన్స్ మీకోసం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Top 10 Micro-Apps
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నటువంటి మీరంతా దానిలో ఉన్నటువంటి కొన్ని మైక్రో అప్లికేషన్స్ గురించి కూడా కొంచెం తెలుసుకుంటే మంచిదని, అలాంటి మైక్రో అప్లికేషన్స్ గురించిన సమాచారం మీకోసం ప్రత్యేకంగా... ఈ మైక్రో అప్లికేషన్స్ వల్ల మనకేంటి లాభం అని అనుకుంటున్నారా.. చాలా సింపుల్ అండి. కంప్యూటర్‌లో ఉన్నటువంటి ఇన్పర్మేషన్, సెట్టింగ్స్, టాస్క్‌లు దీని ద్వారా మీరు ఈజీగా యాక్సస్ చేయవచ్చు. ఇక్కడ మీకోసం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్నటువంటి పది టాప్ మైక్రో అప్లికేషన్స్ గురించిన సమాధానం అందిస్తున్నాం...

విండోస్:
10. GoogleDocsNotifier(గూగుల్ డాక్స్ నోటిఫైర్)

గూగుల్ డాక్స్ నోటిఫైర్ అనేది గూగుల్ ప్రవేశపెట్టినటువంటి మంచి డాక్ప్. దీనిలో గనుక మీకు ఎకౌంట్ ఉన్నట్లు ఐతే మీరు చదవనటువంటి అన్ని గూగుల్ డాక్యుమెంట్స్ ఇందులో భద్రపరచుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా ఏమైనా డాక్యుమెంటరీలు వచ్చినట్లైతే మీరు ఈ డాక్స్‌ని ఈజీగా వాటిని మీ వెబ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేసుకునే వీలుంటుంది.

9. TrayDiskFree(ట్రై డిస్క్ ఫ్రీ)

ఇది మీ హార్డ్ డిస్క్ డ్రైవ్‌లో ఎంత స్పేస్ మిగిలి ఉందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు ఇండికేటర్ రూపంలో చూపిస్తుంది.

8. GMinder(జి మైండర్)

జి మైండర్ అనేది గూగుల్ క్యాలెండర్స్‌కి సంబంధించినది. మీకు సంబంధించినటువంటి ఏమైనా రాబోయేటటువంటి ఈవెంట్స్ ఉంటేగనుక మీకు ముందుగానే వాటిని మిస్ కాకుండా అలర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు గూగుల్ ఎకౌంట్ లోకి సైన్ ఇన్ అవుతారో అప్పటి నుండి ఆటోమాటిక్‌గా మీకు క్యాలెండర్ ఇన్పర్మేషన్ చూపెడుతుంది.

7. ClipCube(క్లిప్ క్యూబ్)

క్లిప్ క్యూబ్ అనేది సిస్టమ్ ట్రే లాంటిది. ఎటువంటి రికార్డ్స్ అయినా మీరు క్లిప్ బోర్ట్ హిస్టరీలో దాచిపెట్టుకోని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు గనుక క్లిప్ క్యూబ్‌ని మీ బ్రౌజర్‌లో యాడ్ చేసుకున్నట్లైతే మీకు ఆటో మాటిక్‌గా దాని గురించిన సమాధానం మీ బ్రౌజర్‌లో దర్శనమిస్తుంది.

6. Minime(మినిమి)

మినిమ్ అంటే దాని మీనింగ్ లోనే ఉంది. మీరు గనుక ఎక్కువ ఓపెన్ చేసినటువంటి అన్ని విండోస్‌ని ఒక్కేసారి యాక్సస్ చేయాలంటే ఆసందర్బంలో మీకు మినిమి ఉపయోగపడుతుంది. మినిమి మీకు సింపుల్‌గా అన్ని విండోస్ బ్రౌజర్స్‌ని చూపిస్తుంది.

5. UltraMon(ఆల్ట్రామాన్)

మీరు గనుక ఒకటి కంటే ఎక్కువ మానిటేర్స్ ఉపయోగిస్తుంటే మీకు తప్పనిసరిగా ఆల్ట్రామాన్ అవసరం అవుతుంది. టాస్క్ బార్‌లో కూడా ఈ ఆల్ట్రామాన్‌కి సంబంధించినటువంటి అన్ని ఫీచర్స్ ఉండడం గమనార్హాం. మీకు గనుక ఒక మానేటర్‌లో ఉన్నటువంటి విండోని టాస్క్ బార్‌లో మినిమైజ్ చేసినట్లైతే, విండోని కేవలం టాస్క్ బార్ లోనే చూపిస్తుంది. ఆల్ట్రామాన్ అనేది కేవలం రెండు మానేటర్స్ ఉన్నప్పుడు మాత్రమే బాగా ఉపయోగపడుతుంది.

4. QuickSync(క్విక్ సింక్)

క్విక్ సింక్ అనేది సిస్టమ్ ట్రేలో ఉంటుంది. ఏదైనా ఫోల్డర్‌ని సింక్రనైజ్ చేయాల్సి వస్తే ఇది చాలా సూపర్ క్విక్‌గా పనిచేస్తుంది. మీకు కావాల్సినటువంటి ఏ పోల్డర్ నైనా మీరు డ్రాగ్ చేసి క్విక్ సింక్ డ్రాప్ జోన్‌లోకి వేస్తే మీకు ఎలాంటి ఫార్మేషన్ కావాలో అలాంటి ఫార్మేషన్‌లోకి ఫోల్డర్ వస్తుంది. ఈ క్విక్ సింక్‌ని మీరు షెడ్యూల్ మాదిరి కూడా చేసుకోవచ్చు.

3. Fences(ఫెన్సెస్)

ఫెన్సెస్ అనేది ఓ చిన్న మైక్రో అప్లికేషన్. దీని వలన డెస్క్ టాప్ మీద ఉన్నటువంటి మీ ఐకాన్స్‌ని శుభ్రంగా ఉంచుకోవచ్చు. అది మాత్రమే కాకుండా మీకు నచ్చినటువంటి ప్లేస్ లోకి తీసుకెళ్శి పెట్టవచ్చు. దీని వలన మీ డెస్క్ టాప్ చాలా శుభ్రంగా ఉంచుకోవచ్చు.

2. Fluffy App(ఫ్లప్ఫీ అప్లికేషన్)

ఫ్లప్ఫీ అప్లికేషన్ అనేది ధర్డ్ పార్టీ ఫోర్ట్ అప్లికేషన్. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైనా ఫైల్‌ని మీరు డ్రాగ్ చేసి అప్ లోడింగ్ చేయడానికి వేసినప్పుడు ఇది ఉపయోగపడుతుంది.

1. AutoHotKey(ఆటో హాట్ కీ)

ఆటో హాట్ కీ వల్ల మనకు చిన్న ఉపయోగం. స్కిప్ట్స్‌ని ఆటో మ్యాటిక్‌గా విండోస్ సిస్టమ్ అర్దం చేసుకునే విధంగా మార్చుతుంది. సాధారణంగా మన ట్రేలో ఏహెచ్‌కె స్కిప్ట్స్ రన్ అవుతూ ఉంటాయి. స్కిప్ట్స్ సిస్టమ్ ట్రేలో ఆటోమ్యాటిక్‌గా రన్ అవుతుంటాయి.

English summary
Tray and Mac OS X menu bar have become prime real estate for highly functional micro-applications that provide easy access to information, settings, and tasks. Here are our top ten favorites for both Windows and Mac.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X