షాపింగ్ మాల్స్‌లో సమయం వృధా అవుతుందా, ఐతే ఆన్‌లైన్ షాపింగే

కాసేపు సమయం వృథా అయినా కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందనుకునే ఈ కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ కారణంగా ఇటు వినియోగదారులు అటు నిర్వాహకులు పెద్ద ఎత్తునే లబ్దిపొందుతున్నారు. ఏ వస్తువు కొనాలన్నా గంటల తరబడి షాపింగ్‌మాల్స్‌లో గడిపేయడం బొత్తిగా నచ్చనివారికి ఆన్‌లైన్ షాపింగ్ చక్కగా ఉపయోగపడుతోంది. కావాల్సిన వస్తువులను, వాటి ధరను ఇంట్లోనే కూర్చుని సెలక్ట్ చేసుకోవడం ద్వారా షాపింగ్‌మా ల్స్‌లో కాలయాపన తప్పుతోందని ఆన్‌లైన్ షాపింగ్ వినియోగదారులు అభిప్రా యపడుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఇంట్లో కంప్యూటర్ కామన్ వస్తువుగా మారడంతో ఆన్‌లైన్ షాపింగ్‌కు సహజంగానే డిమాండ్ పెరుగుతోందనే భావన నిర్వహకుల నుంచి సైతం వినిపిస్తోంది.
కాగా రానున్న మూడేళ్ళలో గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆన్‌లైన్ షాపింగ్ సేవలను విస్తృతపరిచే దిశగా వెళ్తున్నామని రాహుల్ షెట్టీ తెలిపారు. ఇప్పటివరకు నగరాలు, పట్టణాల్లోనే విస్తరించిన ఆన్‌లైన్ షాపింగ్ సేవలు భారీ స్థాయిలో ఆదాయాన్ని సమకూరుస్తు న్నాయని ఈ కారణం గానే తమ సేవలు గ్రామీణ ప్రాంతాలకు వ్యాపింపజేస్తే ఆదాయ మార్గాలు పెరుగుతాయనే ఆలోచన ఉన్నట్లు వెల్లడించారు. రానున్న రెండేళ్ళలో వంద కోట్ల ఆదాయ లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, ప్రస్తుతం సంస్థ ఆదాయం రూ.35 కోట్లుగా ఉందన్నారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్ షాపింగ్ కార్యకలాపా లను నిర్వహిస్తున్న సంస్థ ప్రస్తుతం రూ.1024 కోట్ల ఆదాయం నుంచి రూ.1200 కోట్ల ఆదాయానికి చేరుకోవాలని ఆశిస్తోంది. భారత్‌తోపాటు అమెరికా, బ్రిటన్, చైనా దేశాల లో ఆన్‌లైన్ షాపింగ్ కార్యకలాపాలను నిర్వర్తిస్తున్న ఈ సంస్థ.. దేశ వ్యాప్తంగా నగరాలు, పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు విస్తరణ ప్రక్రియను చేపడుతోంది. ఇదే క్రమంలో ఈ-బే ఇండియా సంస్థ సైతం ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా చెప్పుకోదగ్గ ఆదాయాన్నే ఆర్జిస్తోంది. మొత్తానికి ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్ సేవల పుణ్యమాని ఆన్‌లైన్ షాపింగ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతోంది.