మళ్లీ రెచ్చి పోయిన మావోలు: ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్ల మృతి
National
oi-Srinivas G
By Srinivas
|
చత్తీస్‌గఢ్: దంతెవాడలో మావోయిస్టులు - పోలీసులకు మధ్య జరిగి ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించారు. చత్తీస్‌గఢ్‌లోని రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా బెజ్జి పోలీసు స్టేషన్ పరిధిలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో జవాన్లు రంగంలోకి దిగారు. అయితే మావోయిస్టులు బెజ్జి పోలీసు స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై దాడి చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో జవాన్లు బెజ్జి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో అక్కడకు వెళ్లి వారి కోసం వెతికారు. మావోయిస్టులు అనూహ్యంగా జవాన్లపై మెరుపు దాడి చేశారు.
దీనికి జవాన్లు కూడా తిరిగి కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించారు. మావోయిస్టులు భారీగానే ఉన్నట్లుగా పోలీసు వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో సైన్యం హెలికాప్టర్లలో అదనపు బలగాలను పంపిస్తోంది.