వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వర్గం రాజీనామాలపై స్పీకర్ వెయిట్ అండ్ సీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

nadendla manohar
హైదరాబాద్: రాజీనామాల అంశం విషయంలో నిన్నటి వరకు దూకుడుగా వెళ్లినట్లు కనిపించిన స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇప్పుడు రూటు మార్చారా అంటే అవుననే అంటున్నారు కొందరు. రాజీనామాల విషయంలో తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో డిసెంబర్ 1వ తేది నుండి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నందున ఆ లోగానే ఈ అంశాన్ని తేల్చాలనే ఉద్దేశ్యంతో స్పీకర్ ఇటీవల దూకుడుగా వెళ్లారు. ఇందులో భాగంగా నాగం, నల్లపురెడ్డిల రాజీనామాలు ఆమోదించారు. కొందరు జగన్ వర్గం ఎమ్మెల్యేలను కలిశారు. మిగిలిన వారిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ దశలో జగన్ వర్గానికి చెందిన పలువురు శాసన సభ్యులు రాజీనామాల విషయంలో తమ వైఖరి ఏంటో స్పీకర్ మనోహర్‌ను వ్యక్తిగతంగా కలిసి మరీ తమ మనసులో మాటను వివరించారు.

జగన్ వర్గానికి చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలవాల్సి ఉంది. రెండు రోజుల విశాఖ పర్యటనకు వెళ్లిన స్పీకర్ మనోహర్‌ను జగన్ వర్గ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాసు, కొర్ల భారతి కలిశారు. రాజీనామాలపై తమ నిర్ణయాన్ని స్పష్టం చేసేందుకు కొంత గడువు కావాలని వారు కోరినట్లు సమాచారం. రాజీనామాలపై తాము ఆలోచించుకోవాల్సి ఉందని అన్నట్లు తెలిసింది. అలాగే, పాయకరావుపేట ఎమ్మెల్యే, జగన్ మద్దతుదారుడు గొల్ల బాబూరావు ఆదివారం మధ్యాహ్నం స్పీకర్‌ను కలిశారు. విశాఖ పర్యటన ముగించుకుని తిరిగి వెళుతూ విమానాశ్రయానికి వచ్చారు. ఈ
సందర్భంగా మంత్రి బాలరాజు తదితరులతోపాటు బాబూరావు కూడా స్పీకర్‌ను కలిశారు.

స్పీకర్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇక, జగన్ వర్గానికి చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రదర్శించకుండా 15 రోజులు గడువు కావాలని కోరుతున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజీనామా చేసిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ మనోహర్ ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నారు. రాజీనామాల అంశంలో ఆయా ఎమ్మెల్యేల అభిప్రాయాలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

English summary
It seems, Speaker Nadendla Manohar is not speedy on YSRC Party president YS Jaganmohan Reddy camp mlas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X