వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుమారం: రాజ్యసభలో కంటతడి పెట్టిన ఎకె ఆంటోనీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

AK Antony
న్యూఢిల్లీ: రాజ్యసభలో ఆర్మీ చీఫ్ వికె సింగ్ వ్యాఖ్యలపై మంగళవారం దుమారం రేగింది. రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఆంటోనీ వివరణ సమయంలో ఓ సందర్భంలో సభలోనే కంటతడి పెట్టుకున్నారు. ఆర్మీలో భూకుంభకోణాలపై తాను సిబిఐ విచారణకు ఆదేశించానని ఆంటోనీ చెప్పారు. రక్షణ రంగంలో ఎలాంటి అవినీతికి తావు లేదన్నారు. నా జీవితమంతా అవినీతిపై పోరాటం చేస్తున్నానని చెప్పారు. అవినీతిని రూపుమాపేందుకు ఎంత దూరమైన వెళతానని చెప్పారు. అవినీతి జరిగినట్లు రుజువైతే ఒప్పందాలు రద్దు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆర్మీ చీఫ్ వికె సింగ్ తనకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేయలేదన్నారు. ఆకాశ రామన్న ఉత్తరాలపై కూడా తాను విచారణకు ఆదేశించానని చెప్పారు.

సింగ్ ఫిర్యాదుపై విచారణకు ఆదేశించానని చెప్పారు. నాకు ఎలాంటి దాపరికం లేదన్నారు. వాస్తవాలు చెబుతున్నానని అన్నారు. నేను వాస్తవాలు తప్ప అబద్దాలు చెప్పడం లేదన్నారు. తాను అబద్దాలు చెప్పినట్లు తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు. తేజేందర్ సింగ్ పైన ఆర్మీ చీఫ్ ఆరోపణలు చేశారన్నారు. ఏడాది క్రితమే అతను నాకు ఈ విషయం చెప్పారన్నారు. తేజేందర్ సింగ్ పైన ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తాను అప్పుడే విచారణకు ఆదేశించానన్నారు. తేజేందర్ సింగే ఆర్మీ చీఫ్‌కు లంచం ఇవ్వజూపారని ఆరోపణలు ఉన్నాయన్నారు

English summary
Minister AK Antony wept in Rajya Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X