గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓటుతో ఢిల్లీ పెద్దలకు బుద్ధి చెబుతాం: ఓదార్పులో జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: వచ్చే ఉప ఎన్నికల్లో వేసే ఓటు రాష్ట్ర నాయకులకే కాకుండా ఈ రాష్ట్రాన్ని రిమోట్ కంట్రోల్‌తో పాలిస్తున్న ఢిల్లీ పెద్దలకు కూడా కనువిప్పు కావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విమర్శించారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఆయన పాలక పార్టీపై మండిపడ్డారు. రాష్ట్రం ఇంత అధ్వాన్న పరిస్థితుల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రజా సమస్యలు గాలిగి వదిలేసి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎలా మెప్పించాలనే ఆలోచనతో ఉన్నారని ఆరోపించారు. త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని, రైతులకు అండగా నిలబడి, పేదోడికి తోడుగా నిలిచి అవిశ్వాసానికి మద్దతు తెలిపిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని సూచించారు. మీరిచ్చే తీర్పుతో రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలకులకు బుద్ది వస్తుందేమోనని ఆయన ప్రజలను ఉద్దేశించి అన్నారు.

విజయవగరం, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం, పాలమూరు జిల్లాల్లో మళ్లీ కరువు వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలకు కనీస కూలీ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యమే మనకు పాపమైందన్నారు. సర్కారు నిర్లక్ష్యంతో పల్లెలపై కరువు దాడి చేస్తోందన్నారు. పలు జిల్లాల్లో మహిళలు వలస బాట పట్టారన్నారు. కాగా జగన్ పలు చోట్ల దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy suggested in his odarpu yatra that we must teach a lesson to Delhi leaders with our vote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X