వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై స్వతంత్ర నిర్ణయం స్వేచ్ఛ లేదు: రేణుక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Renuka Chowdary
న్యూఢిల్లీ: తెలంగాణ సమస్యకు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పరిధిలోనే పరిష్కారాన్ని కనుగొంటుందని ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి గురువారం అన్నారు. తెలంగాణ సమస్య సున్నితమైన, భిన్న మనోభావాలతో ముడిపడిన అంశమని, మంచి చెడులను బేరీజు వేసుకోవాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. అయితే, పరిస్థితిని చెడగొట్టకూడదని నాయకులకు సూచించారు. రాష్ట్రంలో తాము శాంతి భద్రతలను కాపాడతామని చెప్పారు. స్వతంత్ర నిర్ణయం తీసుకునేంత స్వేచ్ఛ తమకు లేదని, ప్రజాస్వామ్య ప్రక్రియ పరిధిలోనే తాము పరిష్కారాన్ని కనుగొంటామని అన్నారు.

తాము తీసుకునే ఏ నిర్ణయమైనా ఒక జాతీయ పార్టీగా తమ ప్రస్తుత పరిస్థితిని బేరీజు వేసుకుని, జాతీయ, రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే రీతిలో తీసుకుంటామని వెల్లడించారు. కాగా, ఆర్మీ చీఫ్ వికె సింగ్‌ అంశంపై నా ఆమె స్పందించారు. సింగ్‌ను ఉద్దేశించి.. మా సహనాన్ని బలహీనతగా చూడొద్దని అన్నారు. ఇది చాలా సున్నితమైన అంశమని, పొరుగు దేశ నేతలతో సహా పలు దేశాల నాయకులు దేశంలో పర్యటిస్తున్నారని, దీనిపై కొంత నియంత్రణ అవసరమని ఆమె అన్నారు. దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.

English summary
AICC spokesperson Renuka Chowdary said that only Congress will not decide Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X