హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఇవ్వడమే మంచిదన్న ప్రణబ్: కెకె

By Pratap
|
Google Oneindia TeluguNews

K Keshav Rao
హైదరాబాద్: తెలంగాణ ఇవ్వడమే మంచిదనే అభిప్రాయంతో రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్ ముఖర్జీ అన్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నాయకుడు కె. కేశవ రావు అన్నారు. ఆయన ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడారు. ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ వ్యతిరేకి కారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రణబ్ ముఖర్జీ అడ్డు చెప్పబోరని ఆయన ధీమా వ్యక్తం చేసారు.

తెలంగాణ ఇస్తేనే కాంగ్రెసు పార్టీ మనుగడ సాధ్యమనేది ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయమని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్లుసి) నిర్ణయం తీసుకుందని, తెలంగాణకు అనుకూలమని రాష్ట్రానికి చెందిన అఖిల పక్ష సమావేశం చెప్పిందని, ఈ స్థితిలో శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాలని సూచిస్తే ఇలా జరిగిందేమిటని ప్రణబ్ అన్నారని ఆయన వివరించారు.

గూర్ఖాలాండ్‌తో తెలంగాణకు సంబంధం లేదని కూడా ప్రణబ్ అన్నట్లు ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తెలంగాణకు అనుకూలంగానే ఉన్నారని ఆయన చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటును ఏ శక్తీ ఆపలేదని ఆయన అన్నారు.

ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ వ్యతిరేకి అని తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అంటున్న స్థితిలో కేశవరావు ఆ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వ్యతిరేకి అని చెబుతూ రాష్ట్రపతి ఎన్నికలకు ఆ రెండు పార్టీలు దూరంగా ఉన్నాయి.

English summary

 Congress Telangana region senior leader K Keshav Rao said that the elect president Pranab Mukherjee is not anti - Telangana. He said that Pranab will not obstruct the formation of Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X