వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కసబ్: పాక్ మీడియా ఆచితూచి, ముంబైలో సంబరాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ajmal Kasab
ఇస్లామాబాద్: ముంబై మారణ హోమం నిందితుడు అజ్మల్ కసబ్ ఉరిశిక్షపై పాకిస్తాన్ వెబ్ సైట్స్, టీవీలు ఆచితూచి స్పందిస్తున్నాయి. కసబ్ ఉరిశిక్షకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా, అదే సమయంలో పూర్తిగా విస్మరించకుండా జాగ్రత్త పడుతున్నాయి. పాక్‌కు చెందిన ముఖ్యమైన వార్తా ఛానల్ జియో ఛానల్‌కు చెందిన జియో టివి వెబ్ సైట్లో ఇండియా హ్యాంగ్స్ ముంబై గన్‌మ్యాన్ అజ్మల్ కసబ్ అని రాసింది.

మరో ప్రధాన పత్రిక డాన్‌కు చెందిన డాన్ వెబ్ సైట్ కసబ్‌ను ఉరితీసినట్లుగా భారత మీడియాలో వార్తలు వచ్చాయని రాసింది. మిగిలిన ప్రధాన, లోకల్ వెబ్ సైట్స్ కూడా అలాగే రాశాయి. ముంబై దాడిలో పట్టుబడ్డ కసబ్‌ను భారత్ ఉరి తీసిందని, క్షమాభిక్ష దరఖాస్తును భారత రాష్ట్రపతి తిరస్కరించారని క్లుప్తంగా రాశాయి.

కసబ్ ఉరిశిక్ష విషయాన్ని భారత ప్రభుత్వం ఫ్యాక్స్ ద్వారా పాకిస్థాన్‌కు పంపిచడంతో పాక్ ఈ అంశంపై స్పందించింది. భారత న్యాయ వ్యవస్థ నిర్ణయాన్ని గౌరవిస్తామని పాక్ తెలిపింది.

పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్ష అమలు కావడంతో ముంబై ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలతో మాటు ఆర్థిక నగరం కూడా సంబరాల్లో మునిగి తేలుతోంది. కసబ్‌ను ఉరితీశారన్న వార్త తెలియగానే జనం వీధుల్లోకి వచ్చి బాణా సంచా కాల్చారు. హిందూ, ముస్లిం, సిక్ అని తేడా లేకుండా అన్ని వర్గాల వారు ఆనందోత్సాహాలు ప్రదర్శిస్తున్నారు. ముంబై నగరంలో ఉండే డబ్బా వాలాలు కసబ్ ఫోటోలను దహనం చేశారు. కసబ్ ఉరిని కాంగ్రెసు, బిజెపి సహా అన్ని పార్టీలు స్వాగతించాయి. బహిరంగ ఉరి తీస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. ఆలస్యమైనా సరైన శిక్ష విధించారని ఇంకొంతమంది అభిప్రాయపడ్డారు.

English summary
Pakistan web and TV media is responding carefully on Ajmal Kasab's hanging.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X