చెవిలో పువ్వుల్లేవు: బాబు యాత్రపై గాదె, జగన్ పైనా

విభజనపై తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలది దివాళాకోరుతనమన్నారు. ఆ రెండు పార్టీలు ఎప్పుడు సమైక్యాంధ్ర అనలేదని ఆరోపించారు. సమైక్యవాదాన్ని మొదటి నుండి వినిపిస్తోంది సీమాంధ్ర కాంగ్రెసు నేతలేనని, విభజన నిర్ణయాన్ని తాము స్వాగతించడం లేదని చెప్పారు.
ఢిల్లీ పరిణామాలు గమనిస్తున్నాం: శైలజానాథ్
తాము ఎప్పటికప్పుడు ఢిల్లీ పరిణామాలను గమనిస్తున్నామని మంత్రి శైలజానాథ్ అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కించపర్చేలా చంద్రబాబు లేఖ రాయడం సరికాదన్నారు.
ఆయన వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల 2, 3 తేదీల్లో హైదరాబాదులో దీక్షకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. విభజన విషయంలో చంద్రబాబు పునరాలోచించుకోవాలని హితవు పలికారు. సమైక్యాంధ్రకు ఇంకా అవకాశముందని, ఓట్ల రాజకీయాలను పక్కన పెట్టాలన్నారు.












Click it and Unblock the Notifications