అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వచ్చే సమావేశంలో నిమ్మగడ్డపై నిర్ణయం.. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి, అచ్చెన్న తీరుపై ఫైర్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమిటీ హాల్‌లో ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ పారదర్శకంగా కార్యకలాపాలు కొనసాగిస్తుందని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. సభలో 174 మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్‌పై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. కొందరు సభ్యుల వైఖరిని ఆధారాలు సహా ప్రశ్నించినా వారి నుంచి స్పందన కరవైందని తెలిపారు.

అచ్చెన్న వివరణ సరిగాలేదు..

అచ్చెన్న వివరణ సరిగాలేదు..

ఆశించిన రీతిలో స్పందించని సభ్యులను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించినట్టు వెల్లడించారు. టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణ సరిగా లేదని, అందుకే ఆయనను మరోసారి వివరణ కోరామని వివరించారు. కానీ ఆయన బదులివ్వలేదని తెలియజేశారు. అందుకే వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరామని వివరించారు. శాసనసభ్యుల హక్కులు కాపాడడం తమ కర్తవ్యం అని కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరు ఎవరిపై కామెంట్లు చేసినా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

నిమ్మగడ్డ ఇష్యూపై..

నిమ్మగడ్డ ఇష్యూపై..


మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంపై కూడా కాకాణి స్పందించారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హాజరు కావాలని కోరితే, కరోనా నేపథ్యంలో రాలేనని జవాబిచ్చారని తెలిపారు. ఆగస్టు 10న జరిగే తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కాకాణి గోవర్ధన్ వెల్లడించారు. సమావేశంలో మొత్తం 9 అంశాలపై చర్చించామని తెలిపారు.

ఎమ్మెల్యేల ప్రోటోకాల్

ఎమ్మెల్యేల ప్రోటోకాల్


ఎమ్మెల్యేల ప్రోటోకాల్ అంశం కూడా అందులో ఉన్నట్టు వెల్లడించారు. కొన్ని అభివృద్ధి పనుల వద్ద శిలాఫలకాల్లో ఎమ్మెల్యేల పేర్లు ఉండకపోవడం, వాటిపై అధికారుల నుంచి సరైన వివరణ రాకపోవడం వంటి విషయాలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. ఎమ్మెల్యేలకు సముచిత గౌరవం ఇవ్వకపోవడం, ఇతర ప్రోటోకాల్ ఉల్లంఘనలపై చర్చించినట్టు కాకాణి గోవర్ధన్ వివరించారు.

Recommended Video

Ys Jagan Biopic Blockbuster | PAN India | Oneindia Telugu
వాయిదా.. నిర్వహణ

వాయిదా.. నిర్వహణ


నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీగా ఉన్న సమయంలో ప్రభుత్వంతో యుద్దమే జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా.. తర్వాత నిర్వహణతో జగన్ సర్కార్‌తో తేడాలు వచ్చాయి. ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మధ్య రోజు మాటల యుద్దమే జరిగింది. చివరికీ ఆయన పదవీ విమరణ చేశారు. దీంతో గతంలో ఎమ్మెల్యేలపై కామెంట్ల అంశంపై ప్రివిలేజ్ కమిటీ వివరణ కోరింది. కరోనా నేపథ్యంలో రాలేనని చెప్పడంతో.. వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టంచేశారు.

English summary
kakani govardhan reddy chaired privilege committee meeting today. ex sec nimmagadda ramesh kumar issue will take decision next meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X