అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్‌తో కొడాలి నాని భేటీ.. ఏం చర్చించారంటే..?

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డితో మాజీమంత్రి కొడాలి నాని భేటీ అయ్యారు. ఆయనకు ఇటీవల మంత్రి పదవీ దక్కని సంగతి తెలిసిందే. కార్పొరేషన్ చైర్మన్ పదవీని జగన్ ఆఫర్ చేసినా.. తిరస్కరించినట్టు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఆ తర్వాత నాని మిన్నకుండిపోయారు. కృష్ణా, వైసీపీ జిల్లాల వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంతలో జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

జగన్‌తో నాని భేటీ

జగన్‌తో నాని భేటీ


మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత తొలిసారి సోమ‌వారం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యానికి కొడాలి నాని వచ్చారు. సీఎం జ‌గ‌న్‌తో నాని భేటీ అయ్యారు. 2024 ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్లు స‌మ‌యం ఉన్నా.. ఏపీలో అప్పుడే ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఎన్నిక‌ల్లో పొత్తుల దిశ‌గా టీడీపీ, జ‌న‌సేన, బీజేపీల నుంచి ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తుండ‌టం కాక రేపుతుంది. దీనిపై వైసీపీ కూడా ఘాటుగానే స్పందిసోంది. సరిగ్గా ఈ సమయంలో జ‌గ‌న్‌తో కొడాలి నాని భేటీ కావడం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

 విపక్షాల విమర్శలు.. నాని ఎంట్రీ

విపక్షాల విమర్శలు.. నాని ఎంట్రీ


ప్ర‌భుత్వంపై ఇటీవ‌లి కాలంలో విప‌క్షాల దాడులు పెరిగాయి. వారి దాడులను కౌంటర్ చేయడంలో కొడాలి నాని సిద్దహస్తుడు. ఇప్పుడు ఉన్న మంత్రులు అంబటి రాంబాబు, రోజా కూడా అదే స్థాయిలో విరుచుకుపడేవారు. కానీ వారి కుదురుకోవడానికి.. ఇతర సమస్యల నేపథ్యంలో అంతగా కౌంటర్ అటాక్ ఇవ్వడం లేదు. దీంతో కొడాలి.. సీఎం జగన్‌‌ను మీట్ అవడంతో సర్వత్రా ఆస‌క్తి నెల‌కొంది.

సైలంట్.. ఒక్కసారిగా..

సైలంట్.. ఒక్కసారిగా..


మంత్రివర్గ విస్తరణ తర్వాత కొడాలి నాని సైలంట్ అయ్యారు. ఏమీ పట్టనట్టే ఉన్నారు. పార్టీ బాధ్యతలు ఇచ్చినా.. పెద్దగా బయటకు ఏమీ మాట్లాడలేదు. రాజీనామా చేసిన తర్వాత బయటకు వచ్చి.. అంతా రాజీనామా చేశామని తెలిపారు. తాను కూడా రిజైన్ చేశానని.. తనకేం కొమ్ములు లేవని ఆ సమయంలో పేర్కొన్నారు. కానీ అనూహ్యంగా అతనికి చోటు లభించలేదు. పాతవారు మెజార్టీ లభించినా.. సామాజిక సమీకరణాలు.. ఇతర కారణాల వల్ల బెర్త్ లభించలేదు. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పార్టీ పరంగా కృషి చేయాలని సీఎం జగన్ అప్పుడే చెప్పారని వివరించారు. రెండున్నరేళ్లు అని జగన్ చెప్పారని పేర్కొన్నారు. కానీ ఇన్నాళ్ల తర్వాత జగన్‌తో కొడాలి నాని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

English summary
ex minister kodali nani meets cm ys jagan at tadepalli camp office. they discuss various issues in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X