అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందుకే తెరపైకి కొత్త జిల్లాలు, జగన్ సర్కార్‌పై చంద్రబాబు విమర్శలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు రగడ నెలకొంది. ప్రభుత్వం ఇలా నోటిఫికేషన్ ఇచ్చిందో లేదో.. సంతోషం వెలిబుచ్చేవారు తక్కువ కాగా.. విమర్శలు, తమకు ఈ జిల్లా అని చాలా మంది కోరుతున్నారు. ఏపీలో కొత్త జిల్లాల వ్యవహారంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. త్వరలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఇవాళ టీడీపీ ఎంపీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాల ఏర్పాటు గురించి వారితో చర్చించారు.

చూడండి.. మీరు...

చూడండి.. మీరు...


జగన్ సర్కారుపై చంద్రబాబు విమర్శలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఏపీ సర్కారు తీరుపై కేంద్రం దృష్టి పెట్టాలని కోరారు. సర్కారు ఆర్థిక ఉల్లంఘనలతో రాష్ట్రం అంధకారంలోకి వెళుతోందని విమర్శించారు. 28 మంది వైసీపీ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం తెచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఎవరి కోసం? అని నిలదీశారు. పాలన అంటే అప్పు చేయడం, దోచుకోవడం అన్నట్టుగా మారిందని దుయ్యబట్టారు. సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే కొత్త జిల్లాల డ్రామా మొదలుపెట్టారని కామెంట్ చేశారు.

ఉగాది లోపు

ఉగాది లోపు

ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ఉగాది లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు తెలియజేయాలని కోరింది.

ఇలా జిల్లాలు..

ఇలా జిల్లాలు..


శ్రీకాకుళం కేంద్రంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఉండనుంది. ఈ జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, అముదాలవలస, పాతపట్నం, నరసన్నపేట శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. విజయనగరం కేంద్రంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఉండనుంది. రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపు కోట, గజపతినగరం శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఉండనుంది. భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, గాజువాక శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. ప్రతీ లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా.. ఇంతకుముందు ఉన్నవాటిని కలుపుకొని ప్రకటించారు. ఇదీ దృష్టి మరల్చే ప్రక్రియ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు.

English summary
new districts established is issue diversion tdp chief chandrababu naidu alleges
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X