అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సజ్జల సహా సలహాదారుల పదవీకాలం పొడగింపు, ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సలహాదారుల పదవీకాలం పొడగించింది. ప్రధాన సలహాదారు, ముఖ్య సలహాదారు పదవీకాలం పెంచింది. ఈ మేరకు సోమవారం నిర్ణయం తీసుకుంది. అజేయ కల్లం, సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణ మోహన్, శామ్యూల్ పదవీ పొడగించిన వారిలో ఉన్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌ధాన స‌ల‌హాదారు అజేయ క‌ల్లం ప‌ద‌వీ కాలాన్ని మ‌రో ఏడాది పాటు పొడగించింది. మ‌రో ముగ్గురు స‌ల‌హాదారుల ప‌ద‌వీ కాలాన్ని కూడా పెంచింది. ఏడాదిపాటు ప‌ద‌వీ కాలం పొడిగించిన వారిలో ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డితోపాటు జీవీడీ కృష్ణ‌మోహ‌న్‌, శామ్యూల్ ఉన్నారు. సలహాదారుల పదవీని జగన్ పొడగించారు.

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి కొనసాగుతున్నారు. వైసీపీ పాల‌న మొద‌లైనప్పటి నుంచి ప్ర‌భుత్వానికి స‌ల‌హాదారుగా కొన‌సాగుతున్నారు. ఇప్ప‌టికే ఒకసారి ఆయ‌న ప‌ద‌వీ కాలాన్ని పొడిగించారు. అది ఈ నెల 18తో ముగియ‌నుంది. ఇప్పుడు మరోసారి ఎక్స్ డెంట్ చేశారు. ఆయ‌న ప‌ద‌వీ కాలాన్ని మ‌రో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి మాదిరిగా జీవీడీ కృష్ణ‌మోహ‌న్‌, శామ్యూల్ పద‌వీ కాలాన్ని కూడా ప్ర‌భుత్వం పొడిగించింది.

sajjala and another advisor tenure extended

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సజ్జల కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇంపార్టెంట్ అంశాలను సీఎం జగన్‌తో చర్చిస్తారు. ప్రభుత్వ పథకాలు గురించి మాట్లాడతారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో కూడా సజ్జల కీ రోల్ పోషించారు.

English summary
sajjala ramakrishna reddy and another advisor tenure extended.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X