అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ వివేకా హత్య కేసు: రెండోసారి దస్తగిరి వాంగ్మూలం, ప్రాణాలకు ముప్పు, భద్రత

|
Google Oneindia TeluguNews

మాజీమంత్రి, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. దస్తగరి ఇదివరకే ఈ కేసులో అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసులో దస్తగిరి రెండోసారి వాంగ్మూలం ఇచ్చారు. రెండో వాంగ్మూలం తర్వాత తనకు భద్రత కావాలని అనిపిస్తోందని అన్నాడు. కుటుంబం కోసమే వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారానని దస్తగిరి వివరించాడు. డబ్బు కోసం అప్రూవర్‌గా మారానని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నాడు.

డబ్బులు ఇవ్వలే..

డబ్బులు ఇవ్వలే..

తనకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదన్నాడు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తనకు ప్రాణభయం ఉన్నట్టు తెలుస్తోందని తెలిపాడు. తనతోపాటు కుటుంబానికి ప్రాణహాని ఉందని భయాందోళన వ్యక్తం చేశాడు. ఇప్పటికే జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానని.. తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని, సీబీఐ అధికారులను కోరానని తెలిపాడు. తాను ఎవరి ఒత్తిడితోనూ అప్రూవర్ గా మారలేదని, అప్రూవర్ గా మారడంలో తనపై ఇతరుల ప్రలోభాలు లేవని దస్తగరి స్పష్టం చేశాడు.

ఎస్పీని కోరా..

ఎస్పీని కోరా..

గతంలో తనకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరానని ఆయన వివరించారు. కానీ ఒక్క కానిస్టేబుల్‌ను మాత్రమే తనకు రక్షణగా ఇచ్చారని తెలిపారు. తనకు మరింత భద్రత కల్పించాలని కోరాడు. తాను డబ్బులు ఇస్తే అప్రూవర్ గా మారనని మీడియాలో కథనాలు వస్తున్నాయని.. కానీ నేను ఎవరితో డబ్బులు తీసుకోలేదని.. భార్యాబిడ్డల కోసమే అప్రూవర్‌గా మారనని మీడియా ముందు వెల్లడించారు.

సీబీఐ అధికారిపై కేసు

సీబీఐ అధికారిపై కేసు


వివేకా హ‌త్య కేసు ద‌ర్యాప్తులో మంగ‌ళ‌వారం వ‌రుస ట్విస్టులు జరిగాయి. వివేకా వద్ద కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేసిన ద‌స్త‌గిరి రెండో ద‌ఫా త‌న వాంగ్మూలాన్ని ఇవ్వ‌గా.. ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందంలోని అధికారి రాంసింగ్‌పై ఏకంగా కేసు న‌మోదైంది. విచారణ పేరుతో సీబీఐ అధికారి రామ్‌సింగ్‌ వేధిస్తున్నారని కడప జిల్లా కోర్టులో పులివెందులకు చెందిన ఉదయ్‌ కుమార్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు కడప రిమ్స్‌ పోలీసులు సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పై కేసు నమోదు చేశారు.

English summary
ys viveka murder case approver dastagiri want protection. today he is given statement second time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X