23 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున..!!
రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించిన అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. లోక్ సభ ఆమోదించిన సమయంలో మావిగన్ ప్రతిపాదనను తెరమీదికి తీసుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మచిలీపట్నం- విజయవాడ- గుంటూరు (మావిగన్) ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని సూచించారు.
అదే సమయంలో జగన్ పాదయాత్ర అంశం కూడా తెరమీదికి వస్తోంది. 2027లో ఆయన పాదయాత్ర చేపట్టే అవకాశం ఉంది. పాదయాత్ర సందర్భంగా మావిగన్ అంశాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తారనే అంచనాలు ఉన్నాయి. తాజాగా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో సైతం ఈ అంశం చర్చకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ పరిణామాల మధ్య జగన్.. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను గుర్తు చేసుకున్నారు. 2003లో సరిగ్గా ఇదే ఏప్రిల్ 9వ తేదీన ఆయన ఉమ్మడి ఏపీలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తన పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. 1,475 కిలోమీటర్ల పాటు మండుటెండల్లో నడిచారు వైఎస్ఆర్. అది- రాష్ట్ర రాజకీయాలకు తీవ్రంగా ప్రభావితం చేసింది. అధికారం కోరుకోవాలనుకునే ఏ పార్టీ అయినా సరే పాదయాత్ర మీదే ఆధారపడేలా చేసింది.
నాటి పాదయాత్రను జగన్ గుర్తు చేసుకున్నారు. ఒక నాయకుడు చేసిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రను తిరగరాయగలదని నిరూపించిందని పేర్కొన్నారు. 2023, ఏప్రిల్ 9న ఎర్రటి ఎండలో ప్రజల కష్టాల్లో పాలుపంచుకునేందుకు నాన్న చేపట్టిన ఆ పాదయాత్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపిందని, నేనున్నాననే భరోసా ఇచ్చిందని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కు రాష్ట్రం మొత్తం మద్దతుగా నిలిచి ముఖ్యమంత్రిని చేసిందని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకం చేసిన దగ్గరి నుంచి ఆయన తీసుకు వచ్చిన ఎన్నో సంస్కరణలు, పథకాలు రాష్ట్ర రూపు రేఖలు మార్చేశాయని పేర్కొన్నారు. రైతును రాజుగా నిలిపాయని, అక్కచెల్లెమ్మలు వారి సొంత కాళ్లపై నిలబడేలా చేశాయని, బడుగు, బలహీన వర్గాలకు బతుకుపై భరోసానిచ్చాయని అన్నారు. ఎంతో మంది పేద పిల్లలు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, కలెక్టర్లుగా అయ్యేలా చేసిందని చెప్పారు.
వైఎస్ఆర్ చేపట్టిన ఈ ఒక్క పాదయాత్రతో ఎన్నో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని, ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారని జగన్ చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో నాన్న వేసిన ఆ ముద్రను ఎవరూ చెరిపేయలేనిదిగా అభివర్ణించారు. వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్ర నేటికి 23 ఏళ్లు అయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ తన ఈ ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
-
వివాదాల 'శాంతి'కి జైలు శిక్ష.. అవినీతి సామ్రాజ్యంపై ఏసీబీ పంజా! -
పాదయాత్ర 2.0 పై మారిన జగన్ ఆలోచన, పార్టీ ప్లీనరీ అక్కడే..!! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం












Click it and Unblock the Notifications