స్థానికులకు శుభవార్త చెప్పిన టీటీడీ..!!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభం అయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా లక్షలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలి మూడు రోజుల కోసం మొత్తం 1,76,000 మంది భక్తులను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎంపిక చేశారు.
కాగా- శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తోన్న తిరుపతి, తిరుమల స్థానికకు టీటీడీ శుభవార్త వినిపించింది. వారికోసం ఇదివరకే కేటాయించిన ప్రత్యేక కోటా కింద దర్శనం టికెట్లను జారీ చేయడానికి చర్యలు తీసుకుంటోంది. జనవరి 6, 7, 8 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనం కోసం స్థానికులకు రోజూ 5,000 చొప్పున టోకెన్లు మంజూరు చేయనుంది. దీన్ని కూడా ఈ- డిప్ ద్వారానే స్థానిక భక్తులను ఎంపిక చేయాలని నిర్ణయించింది.

ఈ టోకెన్ల కోసం తిరుమల, తిరుపతికి చెందిన స్థానికులు ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తమ వివరాలను నమోదు చసుకున్న వారికి 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఈ- డిప్ నిర్వహిస్తారు. టోకెన్లను కేటాయిస్తారు. టోకెన్లతో కూడిన లింక్ ను వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ కు పంపిస్తారు. దీన్ని క్లిక్ చేయడం ద్వారా టోకెన్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాలకు చెందిన వాళ్లు దీనికి అర్హులు. టీటీడీ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ లేదా వాట్సాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. 1+3 విధానంలో అంటే టికెట్ బుక్ చేసుకున్న భక్తుడితో పాటు అతని కుటుంబానికి చెందిన ముగ్గురు వైకుంఠ ద్వారం గుండా ఆ దేవదేవుడిని దర్శించుకోవచ్చు. స్థానికులకు వైకుంఠ ద్వార దర్శన సౌకర్యాన్ని కల్పించాలంటూ ఇదివరకే టీటీడీ పాలక మండలిలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఇదిలావుండగా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 68,165 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,087 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.81 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 21 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది.
-
మోహన్ బాబు 'పద్మశ్రీ' వెనక్కు..తెర వెనుక, అనూహ్య పరిణామాలు..!! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications