ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీనామా చేశాకే బీజేపీలో చేరా.. అప్పట్లో ఎన్టీఆర్ ఇలా చేయలేదు: పురంధేశ్వరి

పార్టీ ఫిరాయింపులపై అమిత్ షాకు లేఖ రాసిన దగ్గుబాటి పురందేశ్వరి తనపై వస్తున్న విమర్శలకు స్పందించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: పార్టీ ఫిరాయించిన వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాసి సంచలనం సృష్టించిన బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తనపై వస్తున్న విమర్శలకు స్పందించారు.

ఒంగోలులో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పదో షెడ్యూల్‌ ప్రకారం పార్టీ ఫిరాయించిన వారి సభ్యత్వం రద్దు చేయాలని, ఈ విషయమై తాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్‌షాకు లేఖ రాసిన విషయం వాస్తవమేనన్నారు.

After resignation only I joined in BJP.. NTR also didn't allow like this: Daggubati Purandheswari

అయితే తాను కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చే సిన తర్వాతనే బీజేపీలో చేరానని, తనపై విమర్శ లు చేసేవారు ఆ విషయాన్ని తెలుసుకొని మాట్లాడితే మంచిదని అన్నారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు ఆదెయ్య, రత్తయ్య అనే వ్యక్తులు పదవులకు రాజీనామా చేసి వచ్చిన తర్వాతనే టీడీపీలో చేర్చుకున్న విషయా న్ని గుర్తు చేశారు.

ఇక విజయవాడలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న రాసిన లేఖలోని అంశాలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదగాలనే ఉద్దేశంతో గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. అంతకుముందు ఆమె బాబుజగ్జీవన్‌రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు.

పురందేశ్వరి వ్యాఖ్యలపై విశాఖపట్నంలో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ విష్ణుకుమార్‌ రాజు కూడా విలేకరులతో మాట్లాడుతూ ''ఆ లేఖ పురందేశ్వరి వ్యక్తిగతం. పార్టీ నిర్ణయం కాదు. అయితే ఆమె అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తా'అని వ్యాఖ్యానించడం గమనార్హం.

English summary
BJP Leader Daggubati Purandheswari responded on setires which are coming against her letter to BJP President Amit Shah here in Ongloe on Wednesday. After garland to Babu Jagjeevan Ram Statue she spoke with media and said 'After submission of resignation to Congress Pary only I joined in BJP'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X