'ప్రతిపక్ష పాత్ర కూడ పోషిస్తాం', నాడు ఎన్టీఆర్ అలా, నేడు వైసీపీ ఇలా..

Posted By:
Subscribe to Oneindia Telugu
  AP Assembly Sessions Started Without Opposition YSRCP | Oneindia Telugu

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నాడు అమరావతిలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్షం హజరుకలేదు. అయితే ప్రతిపక్ష పాత్రను కూడ తామే నిర్వహిస్తామని అధికార పక్షం ప్రకటించింది. ఏపీ అసెంబ్లీలో టిడిపి, బిజెపి సభ్యులు మాత్రమే ఉన్నారు.

  వైసీపీ ఎమ్మెల్యేలకు కోడెల ఫోన్: కోర్టు తీర్పు తర్వాతే నిర్ణయం

  పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోలేదనే కారణాన్ని చూపుతూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రను దృష్టిలో ఉంచుకొనే వైసీపీ శాసనసభపక్షం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిందని టిడిపి ఆరోపణలు చేసింది.

  బాబును అంతం చేసే కుట్ర, నాపై జగన్‌తో సహ ఎవరైనా పోటీ చేయండి: ఆది సంచలనం

  మరోవైపు వైసీపీ నేతలకు ప్రజల సమస్యలపై చర్చించేందుకు ఇష్టం లేనందునే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిందని అధికారపక్షం ఎదురుదాడికి పూనుకొంది.అయితే అసెంబ్లీ సమావేశాలకు హజరుకావాలని వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఫోన్ చేశారు. కానీ, అసెంబ్లీ సమావేశాలకు హజరుకాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకొంది. అయితే అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు మంత్రి నారాలోకేష్ మీడియాతో చిట్ చాట్ చేశారు.

  ప్రతిపక్షం పాత్రను కూడ పోషిస్తామన్న టిడిపి

  ప్రతిపక్షం పాత్రను కూడ పోషిస్తామన్న టిడిపి

  ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నాడు ప్రారంభమయ్యాయి. అధికారపక్షంలో ఉన్న టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రమే సభకు హాజరయ్యారు. సమావేశాలను వైసీపీ బహిష్కరించడంతో సభ ఖాళీగా కనపడుతోంది. మీడియాతో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్ నిర్వహించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్రను కూడా పోషిస్తారని లోకేష్ చెప్పారు.

   మంత్రులపై ప్రశ్నలు వేయాలి

  మంత్రులపై ప్రశ్నలు వేయాలి

  మంత్రులపై ప్రశ్నలు సంధించాలంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తమ అధినేత చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. గురువారం నాడు జరిగిన టిడిఎల్పీ సమావేశంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నారు. అయితే తమ నియోజకర్గాలకు సంబంధించిన సమస్యలతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై కూడ ఎమ్మెల్యేలు ప్రశ్నలు వేయాలని ఈ సమావేశలంలో నిర్ణయం తీసుకొన్నారు.

   ఎన్టీఆర్ ఆదర్శాన్ని తప్పుబట్టిన టిడిపి

  ఎన్టీఆర్ ఆదర్శాన్ని తప్పుబట్టిన టిడిపి

  1989 నుండి 1994 వరకు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే ఆ సమయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా టిడిపి ఉంది. ఆ సమయంలో తాను అసెంబ్లీకి హజరుకాబోనని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎన్టీఆర్ ప్రకటించారు. అయితే టిడిపి ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి హజరయ్యారు.ప్రజల సమస్యలను ప్రస్తావించేవారు.. ఈ ఘటనలను టిడిపి నేతలు గుర్తుచేస్తున్నారు. వైసీపీ నేత పాదయాత్రలో ఉంటే అసెంబ్లీకి హజరుకాకపోవడంలో అర్ధం చేసుకోవచ్చని, కానీ, ఎమ్మెల్యేలు కూడ అసెంబ్లీని బహిష్కరించడంలో అర్ధం లేదని టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు.

   విపక్షం లేకుండానే శాసనసభ సమావేశాలు

  విపక్షం లేకుండానే శాసనసభ సమావేశాలు

  ఏపీ రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం లేకుండానే తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనందుకు నిరసనగానే తాము ఈ నిర్ణయం తీసుకొన్నామని వైసీపీ ప్రకటించింది. అయితే కోర్టులకు వెళ్ళి.. కోర్టులు తీర్పులు వెలువరించకముందే తాను ఎలా నిర్ణయాన్ని ప్రకటిస్తానని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నించారు.అయితే అసెంబ్లీ సమావేశాలకు హజరుకావాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు వైసీపీ నేతలకు ఫోన్ చేసి మరీ కోరారు. అయితే వైసీపీ నేతలు మాత్రం తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Ap Assembly sessions started on Friday without Ysrcp.Ysrcp legislature party decided not attend to Ap assembly winter session.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి