వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

AP EAPCET-2021 Results: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల-ఇలా చెక్ చేసుకోండి...

|
Google Oneindia TeluguNews

ఏపీ ఈఏపీసెట్‌- ఇంజినీరింగ్, అగ్రిక‌ల్చ‌ర్ అండ్ ఫార్మ‌సీ ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష (AP EAPCET) ఫలితాలు నేడు (సెప్టెంబర్ 14) విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ ఫలితాలు ఈ నెల 8న విడుదలవగా... తాజాగా అగ్రికల్చర్,ఫార్మసీ కోర్సులకు సంబంధించిన ఫలితాలు విడుదల చేశారు.

ఈ సందర్బంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ... తాజా ఫ‌లితాల్లో 92.85 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్లు తెలిపారు. గతేడాది 80.62 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించగా... ఈ ఏడాది మరో 12 శాతం ఉత్తీర్ణత పెరిగింది. బుధవారం(సెప్టెంబర్ 15) నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని మంత్రి సురేష్‌ తెలిపారు. జనరల్ కేటగిరీలో 25శాతం మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు.ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు కనీస మార్కుల నిబంధనేమీ లేదు.

AP EAPCET 2021 Results released students follow this steps to check results

ఫలితాలు చెక్ చేసుకోండిలా :

అభ్యర్థులు తమ ఫలితాల కోసం https://sche.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. ఆ లింకుపై క్లిక్ చేసిన తరువాత AP EAMCET 2021పై క్లిక్ చేయాలి.ఆపై రిజిస్ట్రేషన్ నంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫలితాలను ఇదే వెబ్ సైట్ నుంచి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఈ నెల 7న ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. కంప్యూటర్ ఆధారిత విధానంలో మొత్తం 5 విడతలుగా పరీక్షను నిర్వహించారు.ఈ పరీక్షలకు మొత్తం 83,822 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 78,066 మంది పరీక్షలు రాశారు. ఇంజనీరింగ్ విభాగంలో ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం 80.62గా ఉంది. మొత్తం 1,66,462 మంది ఇంజనీరింగ్ పరీక్షలు రాయగా.. 1,32,233 మంది క్వాలిఫై అయ్యారు. ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో నిర్వహించారు. ఈ నెల 18 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

English summary
AP EAPCET-Engineering, Agriculture and Pharmacy combined Entrance Test (AP EAPCET) results released today (September 14). State Education Minister Adimulku Suresh released the results at the Higher Education Council office in Mangalagiri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X