ఎలక్ట్రిక్ వాహనాలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! చంద్రబాబు కీలక నిర్ణయాలు..!
ఏపీలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ విద్యుత్ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులతో తాజా పరిస్ధితిపై చర్చించారు. అనంతరం ఆయన కీలక ప్రకటనలు చేశారు. అలాగే విద్యుత్ రంగం విషయంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలు రాష్ట్రానికి ఎలా గుదిబండగా మారాయో వెల్లడించారు.
ఐదేళ్లలో అన్ని ఆర్టీసీ బస్సులను ఈవీలుగా మార్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే త్వరలోనే వెయ్యి ఈవీ బస్సుల్ని కొనుగోలు చేయాలన్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు నాన్ టారిఫ్ ఆదాయం పై దృష్టి పెట్టాలని సీఎం సూచనలు చేశారు. థర్మల్ పవర్ స్టేషన్లలోని బూడిదను వివిధ అవసరాలకు సద్వినియోగం చేసుకునే అంశాన్ని పరిశీలించాలని, కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఐఐటీ బృందంతో అధ్యయనం చేయించాలన్నారు.

రాష్ట్రంలో ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కీలకమైన పరిశ్రమలుగా వీటిని గుర్తించి మరో ఏడాదిపాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తున్నట్టు తెలిపారు. తద్వారా ప్రభుత్వంపై రూ.1,053 కోట్ల భారం పడనుంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రత్యేకించి విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను 2029 నాటికి 9.20 శాతం నుంచి గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవాలని సీఎం సూచించారు. అలాగే ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకలను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు 483కు పైగా ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసి 150 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టనున్నారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు కూడా విద్యుత్ పొదుపు చేసేలా ఉపకరణాలు వినియోగించేందుకు అవగాహనా కార్యక్రమాల్ని చేపట్టాలని సూచించారు.
రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థలు ఐస్(ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ) పాలసీ ద్వారా 60 రోజుల్లోనే తమ కార్యాచరణను ప్రారంభించేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించి అనుమతులు జారీ చేయాలని సీఎం స్పష్టం చేశారు. తద్వారా విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ ఓ న్యూ ఎనర్జీ హబ్‌గా మారాలని వ్యాఖ్యానించారు. ఈ రంగంలో వినూత్న ఆవిష్కరణలు రావాల్సి ఉందని అన్నారు. అలాగే విద్యుత్ సంస్థలు రుణ సమీకరణలో వడ్డీ భారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. విద్యుత్ కొనుగోళ్లలోనూ వ్యయం తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు.

గత పాలకులు విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చేశారని సీఎం తెలిపారు. పీపీఏల రద్దు నిర్ణయంతో రూ.9 వేల కోట్ల మేర భారం ప్రజలపై పడిందని పేర్కొన్నారు. విద్యుత్‌ను వినియోగించుకోకుండానే ఆయా విద్యుత్ కంపెనీలకు రూ.9 వేల కోట్ల ప్రజాధనాన్ని చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థలను గాడిలో పెట్టామని తెలిపారు. విద్యుత్ వ్యవస్థల సమర్ధ నిర్వహణ ద్వారా విద్యుత్ ఛార్జీలను పెంచకుండానే ఆ భారాన్ని జీరో చేయగలిగామన్నారు.
-
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
ఏపీ, తెలంగాణలో జనగణన - ఇవ్వాల్సిన వివరాలు, మార్గదర్శకాలు..!! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
End of Naxalism : ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన ఎర్రజెండా శకం.. -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
Vijayawada: విజయవాడలో నాన్ వెజ్ బంద్-ఇవాళ రాత్రి నుంచే..! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ!












Click it and Unblock the Notifications