ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!!
ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే తెలంగాణలో ఫలితాలను ప్రకటించారు. దీంతో, ఏపీలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్ధుల్లో ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే పరీక్షా పత్రాల మూల్యాంకనం పూర్తయింది. అనంతర ప్రక్రియ కూడా ఓ కొలిక్కి వచ్చింది. దీంతో ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాసెస్ ఈనెల 16వ తేదీ నాటికి పూర్తి చేయనున్నారు. దీంతో.. ఫలితాల వెల్లడి ముహూర్తం పైన ప్రతిపాదనలు సిద్దం చేసారు.
ఏపీలో ఇంటర్ ఫలితాల వెల్లడికి తేదీలు ఖరారు చేసారు. ఈ నెల 18 లేదా 19 తేదీల్లో ఫలితాల ను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. మూల్యాంకనం ఇప్పటికే పూర్తి కాగా, అనంతర ప్రక్రియ కూడా ఓ కొలిక్కి వచ్చింది. దీంతో ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్లో ప్రవేశపెట్టిన కొత్త విధానం ప్రకారం 1359 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు 'అదనపు సబ్జెక్టు' ఆప్షన్ను ఎంపిక చేసుకున్నారు. ఈ సబ్జెక్టు మార్కులను ఇంటర్ బోర్డు విడిగా చూపించ నుంది. విద్యార్థులకు ఇచ్చే రెగ్యులర్ మార్కుల మెమోలో ఈ మార్కులు కలపరు. ఇంటర్మీడి యట్ విద్యలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి 'అదనపు సబ్జెక్టు' అనే ఆప్షన్ వచ్చింది.

ఈ నెల 18 లేదా 19న ఫలితాల వెల్లడి
కాగా, కావాలనుకుంటే ఎంపీసీ వి ద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితంను ఎంపిక చేసుకొని, రెగ్యులర్ సబ్జెక్టులతో పాటు దీన్నీ చదువుకోవచ్చు. దీంతో రాష్ట్రవ్యాప్తం గా 1359 మంది విద్యార్థు లు ఈ అదనపు సబ్జెక్టు ఎంపిక చేసుకున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మొదలైన ఇంటర్మీడి యట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 23వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రధమ సంవత్సరంలో తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా పరీక్షల నిర్వహణకు నెల సమయం పట్టింది. దీంతో, మూల్యాంకనం పూర్తి చేయటం కొంత ఆలస్యమైంది. ఇక మూల్యాంకనం పూర్తి చేయటం తో.. ఈ నెల 18 లేదా 19వ తేదీల్లో ఇంటర్ పరీక్ష ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించారు. 18వ తేదీన విడుదలకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
ప్రజలు సహకరించాలి, ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వినతి..!! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !!












Click it and Unblock the Notifications