రోజూ రాత్రి జగన్-కేసీఆర్ అదే పని -షర్మిల కూడా చెప్పింది -హైదరాబాద్ రెవెన్యూ వదిలేశాం: ఏపీ బీజేపీ
కృష్ణా జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదం తారా స్థాయికి చేరడం, రెండు రాష్ట్రాల సీఎంల పరస్పర విరుద్ద ప్రకటనల నేపపథ్యంలో కేంద్ర జల శక్తి శాఖ సైతం మీటింగ్‌ను వాయిదా వేయడం, ఇది జగన్-కేసీఆర్ కలిసి ఆడుతోన్న డ్రామా అని విపక్షాలు దుమ్మెత్తిపోయడం, జనసేనాని పవన్ కల్యాణ్ సైతం 'జల జగడం నమ్మనశక్యంగా లేద'ని వ్యాఖ్యానించడం లాంటి పరిణామాలు పరిస్థితిని ఇంకాస్త వేడెక్కించాయి. కాగా, తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై తెలంగాణ బీజేపీ కనబరుస్తోన్న దూకుడుకు భిన్నంగా ఏపీ బీజేపీ మెతక వైఖరిని అవలంభిస్తోందనే విమర్శలున్నాయి. వాటికి సమాధానంగా ఏపీ బీజేపీ ఇవాళ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ నేతలు ఇరు రాష్ట్రాల సీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు..
ముండే సిస్టర్స్‌పై మోదీ పాచిక: పంకజ, ప్రీతమ్‌ల కెరీర్ ఖతం -కేంద్ర కేబినెట్ కూర్పుపై శివసేన ఫైర్

కర్నూలులో కీలక సమావేశం
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును సాకుగా చూపుతూ తెలంగాణ గొడవ లేవనెత్తడం, కృష్ణా జలాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చినప్పటి నుంచి అరకొరగా స్పందిస్తూ వస్తోన్న ఏపీ బీజేపీ ఇక జూలు విదల్చనుంది. 'రాయలసీమ నీటి ప్రాజెక్టులు, అభివృద్ది' పేరుతో శుక్రవారం కర్నూలులో కీలక సమావేశం ఏర్పాటు చేసిన ఏపీ బీజేపీ.. జల వివాదంపై స్పష్టమైన వైఖరితో ఒక ఉద్యమాన్ని రూపొందించి ప్రజల ముందుకు వస్తున్నట్లు ప్రకటించింది. రాయల సమీకు చెందిన కీలక నేతలతోపాటు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
కేసీఆర్ జోరు: 10న మళ్లీ వాసాలమర్రికి సీఎం -50వేల ఉద్యోగాల తర్వాత తొలి టూర్ -13న కేబినెట్ భేటీ

హుజూరాబాద్ కోసమే జల వివాదం
10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉన్నా, బయటికి వచ్చేశామని, హైదరాబాద్ నుంచి వచ్చే రెవెన్యూను ఏపీ వదులుకుందని, ఇప్పుడు కృష్ణా జలాల్లోనూ ఏపీకి, ప్రత్యేకించి రాయలసీమకు అన్యాయం జరుగుతుతోందని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. శ్రీశైలం నుంచి కేసీఆర్ అక్రమంగా నీటిని తరలించుకుపోతుంటే జగన్ స్పందించలేదని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ దెబ్బకు కేసీఆర్ కూసాలు కదిలిపోయాయని, హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే మరోసారి తెలంగాణ వాదాన్ని కేసీఆర్ తెరపైకి తెచ్చి, సీమకు అన్యాయం చేస్తున్నాడని, తన మిత్రుడైన ఏపీ సీఎం జగన్ తో కలిసి డ్రామాలాడుతున్నాడని కమలనాథులు విమర్శించారు.
Recommended Video

రోజూ రాత్రి జగన్, కేసీఆర్ ఇలా..
''రాష్ట్ర వ్యాప్తంగా వివాదాలు లేని ప్రాజెక్టుల నిర్మాణాలను గాలికొదిలేసిన జగన్.. పోలవరానికి మాత్రం అంచనాలు పెంచేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాడు. మరోపక్క కేసీఆర్ తో కలిసి తమ వ్యక్తిగత స్వార్థం కోసం ప్రతిరోజూ రాత్రి పూట ఫోన్లలో మాట్లాడుకుంటూ, పగటి పూట మాత్రం ఏమి తెలియనట్టు కేంద్రానికి లేఖలు రాస్తూ నాటకాలాడుతున్నారు. నీటి సమస్యలు పరిష్కరించుకోవటానికి ఆయా బోర్డులు ఉన్నప్పటికీ కొత్తగా వివాదాలను సృష్టించి, ప్రజలను మభ్యపెట్టి ప్రధానమంత్రికి జలశక్తి మంత్రికి లేఖలు రాస్తూ, డ్రామాలు చేస్తూ, మోసం చేస్తున్న వైనాన్ని జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా ఎండగట్టారు. ఇద్దరు సీఎంలు కలిసి ఏపీకి చేస్తోన్న ద్రోహాన్ని ప్రజలకు తెలియజేసేలా ఏపీ బీజేపీ ఒక స్పష్టమైన వైఖరితో ఒక ఉద్యమాన్ని రూపొందించి ప్రజల ముందుకు వస్తుంది'' అని సోము వీర్రాజు తెలిపారు. 2015లో జల ఒప్పందాలపై సంతకాలు చేసిన ఏపీ, తెలంగాణలు ఇవాళ మాత్రం వాటిని ఒప్పుకోబోమనడం భావ్యం కాదని, తెలంగాణను ఏపీ సర్కారు నిలువరించడంలేదని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు.