తిరుమల మద్యం బాటిళ్ల వ్యవహారంలో అనూహ్య పరిణామాలు
తిరుమలలో మద్యం బాటిళ్ల వ్యవహారం టీటీడీ పాలకమండలి ఛైర్మన్ బీఆర్ నాయుడిపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, ఓ మీడియా ప్రతినిధి అరెస్ట్ అయిన తర్వాత పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. దీనిపై వైఎస్ఆర్సీపీ ఎదురుదాడికి దిగింది. బీఆర్ నాయుడుకు సవాల్ విసిరింది. సీసీటీవీకి సంబంధించిన పూర్తి ఫుటేజీని విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
మద్యం బాటిళ్లను తీసుకువచ్చి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో హల్చల్ చేసిన వైసీపీ సోషల్ మీడియా, సాక్షి ప్రతినిధి అరెస్టయ్యాడని, తిరుమలలో భక్తుల మనోభావాలను గాయపరిచేలా వ్యవహరించారని, టీటీడీ, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో భూమన కరుణాకర్ రెడ్డి తన ప్రైవేట్ సైన్యంతో నిత్యం అసత్య ప్రచారాలు చేశాడని బీఆర్ నాయుడు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇటీవల టీటీడీలో జరిగిన ఘటనలో కరుణాకర్ రెడ్డి పాత్రపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను కోరుతున్నానని అన్నారు.

బీఆర్ నాయుడు చేసిన ఈ విమర్శలకు తాజాగా భూమన స్పందించారు. బీఆర్ నాయుడు నిజంగానే భక్తిపరుడే అయితే మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నిజంగానే మద్యం బాటిళ్లను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అక్కడ పెట్టివుంటే- టీటీడీ భద్రత ఏమైందని ప్రశ్నించారు. అలిపిరి వద్ద ఉన్న చెక్ పోస్ట్, టోల్ గేట్, టాస్క్ ఫోర్స్ సిబ్బందిని దాటుకుని మద్యం బాటిళ్లు తిరుమల కొండపైకి చేరేంత వరకూ చూస్తూ ఎలా ఉన్నారని, ఎందుకు పట్టుకోలేకపోయారని నిలదీశారు.
తిరుమల నిఘా వ్యవస్థ కూడా ఏమైందని భూమన ప్రశ్నించారు. నిఘా వ్యవస్థ నిద్రపోతోండటం వల్లే పవిత్రమైన తిరుమల కొండమీద ఎటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించారు. బీఆర్ నాయుడుకు చెందిన ప్రైవేట్ సైన్యం, దళారీ సేన తిరుమల కొండపై రాజ్యమేలుతోందని, వాళ్లే అక్కడ తాగి పడేసి ఉండవచ్చని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. కొండపై బీఆర్ నాయుడి అరాచకాలకు అంతెక్కడుందని అన్నారు. ఛానల్ కు అడ్వర్టయిజ్మెంట్లు ఇచ్చే వారికి దర్శనాలు చేయిస్తోన్నాడని, వారందరూ తాగి పడేసి ఉండొచ్చని భూమన ధ్వజమెత్తారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications