మంత్రులపై చంద్రబాబు తాజా ఫీడ్ బ్యాక్..! అసంతృప్తి ఎక్కడంటే?
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది. ఈ 18 నెలల కాలంలో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అయితే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో మంత్రులు విఫలమవుతున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్వయంగా పలుమార్లు కేబినెట్ భేటీల్లో మంత్రులకు క్లాస్ తీసుకుంటూనే ఉన్నారు. అయినా పరిస్ధితిలో మార్పు రావడం లేదని తెలుస్తోంది.
రాష్ట్రంలో కేబినెట్ మంత్రులపై ఇవాళ అమరావతిలో జరుగుతున్న హెచ్ఓడీల భేటీలో సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ భేటీలో మంత్రుల పనితీరుపై ప్రస్తావన వచ్చింది. దీనిపై స్పందించిన చంద్రబాబు.. మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు లేదని తేల్చేశారు. చాలా మందికి తమ శాఖల్లో ఏం జరుగుతుందో తెలియడం లేదని సీఎం తెలిపారు. అలాగే మంత్రులు కేంద్ర నిధులు తేవడం, వినియోగంలోనూ విఫలమయ్యారని చంద్రబాబు వెల్లడించారు.

కేంద్ర నిధులు తీసుకొచ్చేందుకు, వాటి కోసం చేసే లాబీయింగ్ కోసం మంత్రులు ఒక్కరోజు ఢిల్లీకి వెళ్లడంలో నష్టం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇకనైనా మంత్రులు పనితీరు మార్చుకోవాలని చంద్రబాబు వారికి సూచించారు. ఇప్పటికే పలుమార్లు ఇవే అంశాలపై చంద్రబాబు మంత్రులకు కేబినెట్ భేటీల్లో క్లాస్ లు తీసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా తమ శాఖలపై మంత్రులు పట్టు పెంచుకోవాలని గతంలో ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే మంత్రులు చంద్రబాబు వ్యాఖ్యల్ని ఇప్పటికీ పట్టించుకోవడం లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
-
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications