నా తప్పు సరి చేసుకున్నా..మీరు మాత్రం - మంత్రుల పై చంద్రబాబు సీరియస్..!!
మంత్రుల పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రివర్గ భేటీ వేళ మంత్రుల పైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. శాఖాధిపతుల సమావేశంలోనూ కొందరు మంత్రులు ఇంకా పని తీరు మెరుగుపర్చుకోలేదంటూ అసహనం వ్యక్తం చేసారు. శాఖల వారీగా ఫైళ్ల క్లియరెన్స్ పైనా మంత్రులకు ర్యాంకులు ప్రకటించారు. కాగా.. ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో మరోసారి సీరియస్ అయిన చంద్రబాబు.. వారికి కీలక దిశా నిర్దేశం చేసారు. వారి తీరు పైన మందలించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నలుగురు మంత్రుల పై సీరియస్ అయ్యారు. ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో మొత్తం 44 అంశాలపై చర్చ జరిగింది. కేబినెట్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన నలు గురు మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రివర్గ సమావేశానికి ఆలస్యంగా వస్తే ఎలా అని ప్రశ్నించారు. కనీసం సరైన క్రమశిక్షణ పాటించాలి కదా అని మందలించారు.

మంత్రి మండలి సమావేశం ఈరోజు ఉదయం 10:30 గంటలకు అని ముందే తెలుసు కదా అని నిలదీశారు. ఈ సమావేశానికి తగ్గినట్లుగా మంత్రులు ఎందుకు ప్లాన్ చేసుకోవడం లేదని ప్రశ్నిం చారు. ఈ సారి నుంచి కేబినెట్ భేటీకి ఆలస్యంగా వస్తే సహించేది లేదని మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.
బుధవారం జరిగిన శాఖాధిపతుల సమావేశానికి తాను 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చానని.. దీని కారణంగా అక్కడ ఉన్న అందరికీ క్షమాపణ చెప్పానని వెల్లడించారు. తన తప్పును సరిదిద్దుకున్న నట్లు వివరించారు. ఆలస్యంగా వచ్చిన నలుగురు మంత్రులు ఆనం, సంధ్యారాణి, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ సైతం తప్పు సరిదిద్దుకోవాలని సూచించారు. ఇక పై కేబినెట్ ఎవరైనా ముందే రావాలని.. ఆలస్యం రావద్దని స్పష్టం చేసారు.
కాగా, కేబినెట్ సమావేశం అనంతరం అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఈ రోజు(గురువారం) పార్టీ నేతలతో సీఎం భేటీకానున్నారు. మండల పార్టీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జిల్లా అధ్యక్షులు నియామకంపై త్రిసభ్య కమిటీ వేశారు. కమిటీని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి మాట్లాడనున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లా కమిటీల నియామకంపై ఈ రోజు త్రిసభ్య కమిటీలతో చర్చించనున్నారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్ -
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు - బీ అలర్ట్.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..!












Click it and Unblock the Notifications