వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుట్టిన ఊరు నుంచి.. దాసరి నారాయణ దానాలు లెక్కలేనన్ని...

దాసరి నారాయణ రావు పేద, బలహీన వర్గాల ప్రజలు, పేద సినీ కళాకారులు, సినీ పరిశ్రమకు సేవలు అందించారని, సంఘసేవలో భాగంగా ఆయన తన ఆస్తినే కోల్పోయారని మహిళా చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దాసరి నారాయణ రావు పేద, బలహీన వర్గాల ప్రజలు, పేద సినీ కళాకారులు, సినీ పరిశ్రమకు సేవలు అందించారని, సంఘసేవలో భాగంగా ఆయన తన ఆస్తినే కోల్పోయారని మహిళా చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు.

<strong>చిరంజీవితో విభేదించి, ఆ తర్వాత కలిసి...</strong>చిరంజీవితో విభేదించి, ఆ తర్వాత కలిసి...

బుధవారం ఫిలిం చాంబర్లో దాసరి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. దాసరి చాలా నిరాడంబరమైన వ్యక్తి అన్నారు. అందుకే అందరి హృదయాల్లో నిలిచిపోయారన్నారు.

భూరి విరాళం

భూరి విరాళం

దాసరి నారాయణ రావు సినీ పరిశ్రమలో అందరికీ పెద్ద దిక్కుగా చెబుతారు. దాసరి సేవలోను ముందున్నారు. పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ప్రవేశపెట్టి ఇందుకోసం ఆంధ్రా, ఉస్మానియా, వెంకటేశ్వర, చెన్నై, కేరళ వర్శిటీలకు భూరి విరాళాలు ఇచ్చారు.

పుట్టిన ఊరులో..

పుట్టిన ఊరులో..

తాను పుట్టిన ఊరైన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో తన పేరుతో దాసరి నారాయణరావు మహిళా కళాశాలను 1980లో స్థాపించారు. తన భార్య దాసరి పద్మ పేరుతో చెన్నైలో పద్మ విద్యాలయను స్థాపించారు.

సంక్షేమం కోసం..

సంక్షేమం కోసం..

1975లో కాకినాడ పోలీస్ సంక్షేమ నిధికి విరాళాలు సేకరించి తన మొత్తం కూడా చేర్చి రూ.4.50 లక్షలు అందజేశారు. 1977లో హైదరాబాదులో మతసామరస్య ర్యాలీని నిర్వహంచారు. 1998లో సైక్లోన్ రిలీఫ్ ఫండ్ కోసం దక్షిణ-ఉత్తర భారత సినీ నటులతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించి మూడు కోట్ల రూపాయలు సేకరించారు.

కళాకారుల్ని రప్పించి..

కళాకారుల్ని రప్పించి..

1999లో స్ట్రీట్ ర్యాలీలు, వినోద కార్యక్రమాలు నిర్వహించి కార్గిల్ యుద్ధవీరుల నిధికి పెద్దమొత్తాన్ని అందించారు. విశఖలో పోలీస్ స్టేషన్ నిర్మాణ నిధుల కోసం 1982లో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజ కళాకారులను రప్పించి 'దాసరి స్ట్రీట్ నైట్' నిర్వహించి, తద్వారా వచ్చిన సొమ్మును విరాళంగా దాసరి అందజేశారు.

గుప్త దానాలు కూడా...

గుప్త దానాలు కూడా...

1985లో తుపాను బాధితుల సహాయార్ధం రూ.30 లక్షలు సేకరించి అందించారు. 1986లోనూ రూ.35 లక్షలు విరాళంగా సేకరించి కరవు నివారణ నిధికి అందించారు. 1990లో స్టార్ నైట్ నిర్వహించి తద్వారా సేకరించిన రూ. కోటిని ప్రభుత్వానికి అందించారు. గుప్తదానాలు కూడా చేసేవారు.

English summary
Former Union Minister and Film Maker Dasari Narayana Rao donationa list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X