Vande Bharat: కోనసీమలో తొలి వందేభారత్...! రేపే ప్రారంభం...!
ఏపీలో వందేభారత్ ప్రయాణికులకు రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకూ విజయవాడ-విశాఖ మార్గంలోనే పరుగులు తీస్తున్న వందేభారత్ తొలిసారిగా కోనసీమలో నుంచి పరుగులు తీయబోతోంది. దీంతో తొలిసారి కోనసీమ వాసులు వందేభారత్ ప్రయాణాన్ని ఆస్వాదించబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి. రేపు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఈ రైలును ప్రారంభిస్తారని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
చెన్నై నుంచి విజయవాడ వరకూ ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును రేపటి నుంచి నరసాపురం వరకూ నడిచేలా మార్పు చేశారు. దీంతో నరసాపురం నుంచి చెన్నైకు ప్రయాణించే వందే భారత్ రైలును కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ రేపు మధ్యాహ్నం 1.30కు ప్రారంభిస్తారు. నరసాపురం నుంచి బయలుదేరిన తర్వాత భీమవరం టౌన్, గుడివాడ స్టేషన్లలో ఈ రైలుకు కొత్తగా హాల్ట్ లు ఇచ్చారు. అలాగే చెన్నై నుంచి నరసాపురానికి వచ్చే రైలు కూడా ఈ స్టేషన్లలో ఆగనుంది.

నరసాపురం-చెన్నైవందేభారత్ రైలుకు జనవరి 11 వరకూ తాత్కాలిక షెడ్యూల్ ఇచ్చారు. అనంతరం కొత్త షెడ్యూల్ ఇస్తారు. దాని ప్రకారమే ఈ రైలు నరసాపురం నుంచి చెన్నైకు ప్రయాణించబోతోంది. తాజా మార్పుల ప్రకారం ఈ రైలు నరసాపూర్ , చెన్నై మధ్య 655 కి.మీ దూరాన్ని కేవలం 9 గంటల్లోనే ప్రయాణిస్తుంది. ఈ రైలులో ఏడు ఏసీ చైర్ కార్ కోచ్‌లు , ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ ఉంటాయి. 530 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతో ఇది ప్రయాణిస్తుంది. ఈ రైలు మంగళవారం తప్ప వారంలో మిగతా రోజులు ప్రయాణిస్తుంది.

జనవరి 11వ తేదీ వరకూ మాత్రమే వర్తించే తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ నరసాపురంలో మధ్యాహ్నం 2.50కి బయలుదేరి, భీమవరంలో 3.19కి, గుడివాడలో 4.04కి, విజయవాడలో 4.50కి, తెనాలిలో 5.19కి, ఒంగోలులో 6.29కి , నెల్లూరులో 7.39కి, రేణిగుంటలో 9.50కి ఆగుతుంది. చివరిగా 11.45కు చెన్నై సెంట్రల్ స్టేషన్ కు చేరుతుంది. తిరిగి చెన్నై సెంట్రల్ లో ఉదయం 5.30కి బయలుదేరే వందేభారత్.. రేణిగుంటలో 7.05కి , నెల్లూరులో 8.39కి, ఒంగోలులో 10.09కి , తెనాలిలో 11.21కి, విజయవాడలో 11.45కి, గుడివాడలో 12.28కి , భీమవరంలో 1.15కి ఆగుతుంది. చివరిగా నరసాపురానికి 2.10కి చేరుకుంటుంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications