శుభవార్త: తిరుపతి నుండి ఆధ్యాత్మిక కేంద్రాలకు, విదేశాలకు విమాన సర్వీసులు.. ఎప్పుడంటే
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పారు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన తిరుపతి నుండి తక్కువ సమయంలో సందర్శించే అవకాశం ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాలకు త్వరలోనే విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు.
ఆధ్యాత్మిక కేంద్రాలకు, విదేశాలకు విమాన సర్వీసులు
తిరుపతి నుండి దేశంలోని వివిధ ఆధ్యాత్మిక స్థలాలకు విమాన సర్వీసులను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తో కలిసి శ్రీకాళహస్తి లో స్వామివారిని దర్శించుకున్న తర్వాత మాట్లాడిన ఆయన తిరుపతి నుండి దేశంలోని ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు విదేశాలకు కూడా సర్వీసులు నడిపిస్తామని తెలిపారు.

అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించే ప్లాన్
ముఖ్యంగా తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉందని రేణిగుంట విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించే దిశగా కార్యచరణ రూపొందిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అంతేకాదు కేంద్రం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విమానయాన శాఖకు బడ్జెట్లో భారీగా కేటాయింపులు కూడా చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఏవియేషన్ రంగంలో ఏపీ అగ్రభాగంలో ఉండేలా ప్లాన్
మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్ర విమానయాన శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కింజారపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయడానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా పలు విమానాశ్రయాలను ఏర్పాటు చేయడంతో పాటు, కొత్త విమాన సర్వీసులతో ఏవియేషన్ రంగంలో ఏపీని అగ్రభాగాన నిలబెట్టాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు.
ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక
కాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడ (గన్నవరం), తిరుపతి, కడప, కర్నూలు (ఓర్వకల్), రాజమండ్రి విమానాశ్రయాలు సేవలను అందిస్తున్నాయి. మరోవైపు భోగాపురం వద్ద అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణం జూన్ 2026 నాటికి పూర్తికానుంది. ఇవి కాకుండా కుప్పం, దగదర్తి, తాడేపల్లిగూడెం, ఒంగోలు, శ్రీకాకుళం, తుని-అన్నవరం, నాగార్జున సాగర్ వంటి ప్రదేశాలలో కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది.
-
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..












Click it and Unblock the Notifications