ఆ పోస్ట్‌లు పెట్టొద్దని తెలియదు: తగ్గిన పొలిటికల్ పంచ్ రవికిరణ్, అనితపై..

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: శాసన మండలి పోస్టులు అలా పెట్టకూడదని తనకు తెలియదని పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు రవికిరణ్ ఆదివారం చెప్పారు. రవికిరణ్‌తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ ఇంచార్జ్ మధుసూదన్ ఈ రోజు తుళ్లూరు పోలీసుల ఎదుట హాజరయ్యారు.

ఈ సందర్భంగా రవికిరణ్ స్పందించారు. మండలిపై అలా పోస్టులు పెట్టకూడదని తనకు తెలియదన్నారు. తద్వారా మండలిపై పెట్టిన పోస్టులపై అతను తగ్గినట్లుగా భావించవచ్చు.

ravikiran

అలాగే, విశాఖపట్నంలో ఎమ్మెల్యే వంగలపూడి అనిత తనపై కావాలనే తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. అనిత గురించి తాను ఎలాంటి పోస్టులు పెట్టలేదన్నారు.

పొలిటికల్ పంచ్.. కేసీఆర్ మాటేమిటి!: వైసిపి మధు, జగన్ ఎంతిస్తున్నారు.. రవికిరణ్‌తో పోలీసులు

కాగా, రవికిరణ్‌తో పాటు మధుసూదన్ కూడా హాజరయ్యారు. శాసన మండలి పైన అనుచిత పోస్టులు పెట్టారని రవికిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసి, ఆ తర్వాత విడుదల చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన తుళ్లూరు పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Political Punch Ravikiran on Sunday said that he don't know about posts about MLA Anitha.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి