పిడుగులు, భారీ వర్షాలు - ఏపీలో ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ అయింది. నాలుగు రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆరెంజ్ అలర్ట్ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తాజా హెచ్చరిక జారీ చేసారు. దీంతో.. రానున్న రెండు రోజుల పాటు పలు జిల్లాల్లోని రైతాంగం అలర్ట్ గా ఉండాలని సూచించారు. కోస్తాతో పాటుగా రాయలసీమ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగుపాటు పైన ఏపీ విపత్తుల శాఖ హెచ్చరిక చేసింది. అల్లూరి, పోల వరం, కాకినాడ, తూర్పుగోదావరి , ఏలూరు,ఎన్టీఆర్, గుంటూరు,పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడతాయని అంచనా వేసింది. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక, ఎల్లో అలర్ట్ జారీ చేసిన విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని విపత్తుల నిర్వహణ అధికారులు సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదని.. ఇంట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులను వాడటం తగ్గించాలని సూచన చేసారు.

వాతావరణ శాఖ కీలక సూచనలు
ఒక్క సారిగా ఏపీలో వాతావరణం మారిపోయింది. ఒకవైపు ఉపరితల ఆవర్తనం, మరోవైపు అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా తీర ప్రాంతాలు, రాయలసీమ లో ఈదురు గాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్ తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం మూడు రకాల వాతావరణ పరిస్థితులు రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయి. దక్షిణ అంతర కర్ణాటక పరిసరాల్లో సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి ఉత్తర అంతర కర్ణాటక వరకు తమిళనాడు మీదుగా 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావం ఈరోజు కొంత తగ్గింది. దీంతో, రైతాంగం అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!













Click it and Unblock the Notifications