• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ దగ్గర ఇప్పుడు సమాధానం లేదు?

|
Google Oneindia TeluguNews

రాజ‌కీయాల్లో ఆరితేరారు. వ్యూహాలు ప‌న్న‌డంలో 'గండ‌ర గండ‌డు'గా పేరు తెచ్చుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధినాయ‌క‌త్వంతో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తాన‌ని చెప్పి హైద‌రాబాద్‌లో విమానం దిగ‌గానే 'నై నై' అని చెప్పేంత గ‌డుసుత‌నం ఉంది. ద‌ళితుణ్ని ముఖ్య‌మంత్రిని చేస్తాన‌ని చెప్పి అధికారం ద‌క్క‌గానే తానే ముఖ్య‌మంత్రి అయ్యేంత సామ‌ర్థ్యం ఉన్న‌ కేసీఆర్ అంత ఆషామాషీగా పార్టీ పేరు మార్పు అంశంపై నిర్ణ‌యం తీసుకోర‌ని ఆయ‌న స‌న్నిహితులు గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. తెలంగాణ అంటే కేసీఆర్‌, కేసీఆర్ అంటే తెలంగాణ‌గా మారిపోయిన వాతావర‌ణంలోకి అనూహ్యంగా భార‌త్ రాష్ట్ర స‌మితిని తీసుకువ‌చ్చారు.

అంతు చిక్కని కేసీఆర్ వ్యూహం

అంతు చిక్కని కేసీఆర్ వ్యూహం


జాతీయ రాజ‌కీయాల్లోకి బీఆర్ఎస్ పేరును చొప్పించాల‌న్నా, 140 కోట్ల జ‌నాభా నోళ్ల‌లో భార‌త్ రాష్ట్ర స‌మితి పేరు నానాల‌న్నా ఎంతో స‌మ‌యం ప‌డుతుంది. కానీ పార్టీ మార్పు నిర్ణ‌యం వెన‌క అంతుచిక్క‌ని వ్యూహం దాగివుంద‌ని కేసీఆర్ తో స‌న్నిహితంగా మెలిగిన రాజ‌కీయ నేత‌లు చెబుతున్నారు. దీనిపై ఆయ‌న కూడా ఇంత‌వ‌ర‌కు వారితో మాట్లాడ‌లేదు. నెలరోజుల క్రితమే బీఆర్ఎస్ పెట్ట‌బోతున్నారంటూ వార్త‌లు వ‌చ్చాయి.

టీఆర్ఎస్ నేతల్లో హాట్ టాపిక్!

టీఆర్ఎస్ నేతల్లో హాట్ టాపిక్!


జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించాలంటే సాధ్య‌మైన‌న్ని ఎంపీ సీట్లు ఉండాలి. తెలంగాణ‌లో ఉన్న‌వే 17 ఎంపీ స్థానాలు. అందులో హైద‌రాబాద్‌లో ఎంఐఎం గెల‌వ‌డం సాధారణమైంది. మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి పోటీని త‌ట్టుకొని ఎన్ని సీట్లు సాధించగలుగుతుంద‌నేది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. వ‌రుస‌గా రెండు సార్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌పై స‌హ‌జంగానే వ్య‌తిరేక‌త ఉంటుంది. దీన్ని అధిగ‌మించి సాధ్య‌మైన‌న్ని సీట్లు సాధించాలంటే ఏం చేయాల‌నే అంశమే టీఆర్ఎస్ నేతల్లో హాట్ టాపిక్ గా మారింది.

అంతా చిదంబర రహస్యమే!

అంతా చిదంబర రహస్యమే!


పొరుగునే ఉన్న ఏపీలో వైసీపీకి 22, టీడీపీకి మూడు సీట్లున్నాయి. పార్టీ పెట్టి ప్ర‌చారం చేసినంత‌మాత్రాన పక్క రాష్ట్రంలో కనీసం ఒక ఎంపీ స్థానం గెలిచేంత బ‌లం వ‌స్తుందా? అనే సందేహం ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క‌పాత్ర పోషించాలంటే డీఎంకేక‌న్నా, వైసీపీకన్నా, తృణ‌మూల్ కాంగ్రెస్‌క‌న్నా, ఎన్‌సీపీ, శివ‌సేన‌, ఆర్‌జేడీ, స‌మాజ్‌వాదీ, బీజేడీక‌న్నా ఎక్కువ సీట్లు సంపాదించాలి. ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఇది సాధ్య‌మ‌వుతుందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. ఒక‌వేళ బీజేపీ, కాంగ్రెస్ విమ‌ర్శిస్తున్న‌ట్లుగా త‌న కుమారుణ్ని ముఖ్య‌మంత్రిని చేయ‌డానికే పార్టీ పేరు మార్చారా? అనేది కూడా స్ప‌ష్ట‌త ఇవ్వాల్సింది కేసీఆర్ ఒక్క‌రే. ఆయ‌న చెప్పేంత‌వ‌ర‌కు ఇదంతా చిదంబ‌ర ర‌హ‌స్యంగానే మిగిలిపోనుంది.

English summary
It will take a lot of time to insert the name of BRS into the national politics and to get the name of Bharat Rashta Samiti on the lips of 140 crore people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X