అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

31న టీడీపీలోకి కొండ్రు, ప్రతిభాభారతిపై అసంతృప్తి! మారనున్న రాజకీయ ముఖచిత్రం

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండ్రు మురళి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఆగస్ట్ 31వ తేదీన అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయన ఆదివారం తన అనుచరులతో రాజాంలో భేటీ కానున్నారు.

ఆ తర్వాత అధికారికంగా ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. టీడీపీలోకి వచ్చే అంశంపై గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌‌లో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షులు కోండ్రు ఆ పార్టీని వీడి సైకిల్‌ ఎక్కేందుకు నిర్ణయించుకున్నారు. పార్టీలో ఆయనను చేర్చుకొనేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది.

టీడీపీలోకి కాంగ్రెస్ నేతల క్యూ, ప్రతిభ అసంతృప్తి: ఊరుకోం.. కాంగ్రెస్‌తో దోస్తీపై అయ్యన్నటీడీపీలోకి కాంగ్రెస్ నేతల క్యూ, ప్రతిభ అసంతృప్తి: ఊరుకోం.. కాంగ్రెస్‌తో దోస్తీపై అయ్యన్న

 అనుచరులతో కీలక సమావేశం

అనుచరులతో కీలక సమావేశం


దీంతో కోండ్రు అభిమానులు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పార్టీ నాయకులు, శ్రేణులతో ఆదివారం కీలక సమావేశం నిర్వహింస్తారు. తాను కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో ఎందుకు చేరుతున్నానో వివరించే అవకాశముంది. టీడీపీలోకి తనతోపాటే అందరూ నడవాలని కోరనున్నారని తెలుస్తోంది.

ప్రతిభా భారతిపై పార్టీ అధినేతకు ఫిర్యాదు

ప్రతిభా భారతిపై పార్టీ అధినేతకు ఫిర్యాదు

కొండ్రు మురళి రాక నేపథ్యంలో రాజాం నియోజవకర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా మరోసారి వేడెక్కాయి. పార్టీకి చెందిన రాజాం నియోజకవర్గం నాయకులు కొందరు ఇటీవలి వరకు మాజీ స్పీకర్‌, టీడీపీ ఇంచార్జ్ ప్రతిభా భారతిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వరుసగా సమావేశాలు పెట్టారు. పార్టీ అధినేతకూ ఫిర్యాదు చేశారు.

టిక్కెట్ రేసులో తెరపైకి ఇతరులు

టిక్కెట్ రేసులో తెరపైకి ఇతరులు

ఏపీ టీడీపీ అధ్యక్షులు, మంత్రి కళా వెంకట్రావుకు వ్యతిరేకంగా టీడీపీ సమావేశంలో ప్రతిభా భారతి ఫిర్యాదు చేశారనే సమాచారంతో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ప్రతిభా భారతి పేరుతో కొందరు పాంప్లెట్లు పంచారు. ఈ పరిణామాల నేపథ్యంలో టిక్కెట్ రేసులోకి ఇతరులు తెరపైకి వచ్చారు. ఇదే సమయంలో కొండ్రు మురళీ పార్టీలోకి వస్తున్నారు. దీంతో రాజకీయం మరింత వేడెక్కింది. దీంతో రాజాం రాజకీయ ముఖచిత్రం మారే అవకాశముంది.

కొండ్రు కటౌట్లు తొలగింపు

కొండ్రు కటౌట్లు తొలగింపు

చంద్రబాబు సమక్షంలో కొండ్రు టీడీపీలో చేరనున్నారు. ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పది ఏసీ బస్సులు, యాభై కార్లలో నాయకులు, శ్రేణులు అమరావతికి వెళ్లనున్నారని తెలుస్తోంది. మరోవైపు కొండ్రు టీడీపీలోకి రానుండటంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద శనివారం ఆయన కటౌట్లను తొలగించారు.

English summary
Former Minister and senior Congress leader Kondru Muralimohan is all set to join the Telugu Desam Party in the presence of TDP president and Chief Minister N.Chandrababu Naidu on August 31 in Vijayawada, sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X