చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: పుదుచ్చేరి మంత్రి మల్లాడి ఆగ్రహం

Subscribe to Oneindia Telugu

తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పుదుచ్చేరి మంత్రి, యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు తీవ్రంగా మండిపడ్డారు. విశాఖపట్నంలో మత్సకారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంపై మల్లాడి విమర్శలు గుప్పించారు.

 Malladi krishna rao fires at Chandrababu

తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన మత్స్యకారులపై మండిపడటానికి చంద్రబాబు ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. తక్షణమే మత్స్యకారులకు క్షమాపణ చెప్పాలని మల్లాడి కృష్ణారావు డిమాండ్‌ చేశారు.

యాభై సంవత్సరాలు దాటిన మత్స్యకారులకు పింఛన్లు, బ్యాన్‌ పీరియడ్‌ రిలీఫ్‌ ఇస్తానని చెప్పిన చంద్రబాబు.. ఎందుకు ఇవ్వలేందంటూ ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవడానికి మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేరుస్తానని చంద్రబాబు చెప్పారని, అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఎందుకు చేర్చలేదో వివరణ ఇవ్వాలని మల్లాడి డిమాండ్‌ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Puducherry minister Malladi Krishna Rao fired at Andhra Pradesh CM Chandrababu Naidu for fishermen issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి