మంగళగిరిలో రేపు మెగా జాబ్ మేళా..! కంపెనీలు, ఉద్యోగాలు, జీతం వివరాలివే..!
ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరిలో రేపు (శనివారం) మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈ జాబ్ మేళా నిర్వహిస్తోంది. గతంలో ఇక్కడే పలు జాబ్ మేళాలు నిర్వహించగా.. తాజాగా మరోసారి ఉద్యోగాల కల్పన కోసం ఈ మేళా జరుగుతోంది. దీనికి సంబంధించి వివరాలను ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ప్రకటించింది.
రేపు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ మంగళగిరి వీటీజేఎం-ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 10కు పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. అలాగే మొత్తం 262 మందికి పైగా ఖాళీలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ వంటి అర్హతలున్న 18 నుండి 25 ఏళ్ల మధ్య వయస్సు గల నిరుద్యోగుల్ని దీనికి ఆహ్వానిస్తున్నారు.

వీరంతా అవసరమైన ఆధార్, సర్టిఫికేట్లు, ఫోటోలు, బయోడేటాతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని అధికారులు సూచిస్తున్నారు. ఎంపికయ్యే వారికి నెలకు ₹10,000-₹30,000 వరకు వేతనాలు లభించనున్నాయి. అలాగే ఈ మేళాలో పాల్గొనాలనుకునే నిరుద్యోగులు.. రిజిస్ట్రేషన్ కోసం నైపుణ్యం పోర్టల్ (naipunyam.ap.gov.in) ద్వారా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అదనపు వివరాల కోసం 8074597926, 7780588993, 9347372996 నంబర్లను సంప్రదించవచ్చు. అలాగే జాబ్ మేళా జరిగే స్థలంలోనే ప్రత్యక్ష రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
-
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications