జగన్‌ను నమ్మితే, ఇంత పని చేస్తారా: మంత్రి సుజయ కృష్ణ ఆగ్రహం

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయనగరం/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజయ కృష్ణ రంగారావు శుక్రవారం నిప్పులు చెరిగారు.

జగన్‌కు షాకిచ్చిన కర్నూలు జిల్లా నేత

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని, కాబట్టి టిడిపి కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రావాలన్న జగన్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని సుజయ విమర్శించారు.

నిన్నటి దాకా అలా..

నిన్నటి దాకా అలా..

నిన్నటి దాకా ఎన్డీయే నుంచి టిడిపి బయటకు రావాలని చెప్పి ఇప్పుడు తాను మద్దతు పలుకుతానని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. జగన్ స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ తీరు మారాలను అభిప్రాయపడ్డారు.

బీజేపీకి మద్దతా?

బీజేపీకి మద్దతా?

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి జగన్‌ మద్దతిస్తానని చెప్పడం, నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేయడమేనని సుజయ అన్నారు. జగన్ ఏ ప్రాతిపదికన బీజేపికి మద్దతిస్తారని ప్రశ్నించారు. కాగా, సుజయ గత సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి నుంచి గెలిచి ఆ తర్వాత టిడిపిలో చేరి మంత్రి అయ్యారు.

ఈ మెయిల్స్‌తో..

ఈ మెయిల్స్‌తో..

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నేత జగన్ ఓర్చుకోలేకపోతున్నారని టిడిపి నేత కళా వెంకట్రావు వేరుగా మండిపడ్డారు. అమెరికాకు తప్పుడు ఈ మెయిల్స్ పంపి రాష్ట్ర ప్రతిష్టను మంటకలిపే ప్రయత్నం చేశారన్నారు.

అసత్య ప్రచారం

అసత్య ప్రచారం

చంద్రబాబుపై, టిడిపిపై అసత్య ప్రచారం చేశారని నిప్పులు చెరిగారు. నీచ మనస్తత్వం ఉన్న వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యంలో విలువలు పాటించాలని జగన్‌కు సూచిస్తున్నామన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister and Telugudesam Party leader Sujaya Krishna Ranga Rao on Friday asked YS Jagan why he is supporting BJP.
Please Wait while comments are loading...