అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పీఆర్సీ మరింత ఆలస్యం- తేల్చేసిన జగన్ సర్కార్-సీఎంతో భేటీ తర్వాత సజ్జల కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ ప్రకటన మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే పీఆర్సీకి సంబంధించిన వివిధ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచిన ఉద్యోగ సంఘాలు.. ఫిట్ మెంట్ పై గట్టిగా పట్టుబడుతున్నారు. దీంతో ప్రభుత్వం కూడా వారిని నిరాశపర్చకుండా సాధ్యమైనంత ఎక్కువ శాతం ఇవ్వాలని భావిస్తోంది. దీంతో పీఆర్సీ ప్రకటన ఆలస్యం అవుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దీంతో కొత్త ఏడాదిలోనే ఈ ప్రకటన వెలువడొచ్చని తెలుస్తోంది.

ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారం

ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారం

ఏపీలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీపై ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో ఇక ఎట్టిపరిస్ధితుల్లోనూ తగ్గరాదని భావిస్తున్న ఉద్యోగ సంఘాలు రెండు నెలల క్రితం పోరు ప్రారంభించాయి. దీంతో ప్రభుత్వం కూడా వారితో పలు దఫాలుగా చర్చలు జరిపింది. అదే సమయంలో సీఎస్ తో కూడిన అధికారుల కమిటీ 14.29 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే ఇది ఉద్యోగులు కోరుతున్న ఫిట్ మెంట్ శాతంలో సగం కూడా లేకపోవడంతో వారు పెదవి విరిచారు. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది.

ఫిట్ మెంట్ శాతమే సమస్య

ఫిట్ మెంట్ శాతమే సమస్య

ఉద్యోగులు కోరుతున్న విధంగా 45 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఫిట్ మెంట్ ఇచ్చే పరిస్ధితి ఏపీలో లేదు. ఇప్పటికే అప్పులతో నడుస్తున్న ప్రభుత్వం ఇందుకోసం మరో కొత్త అప్పు తెచ్చేందుకు సిద్ధంగా లేదు. దీంతో ఉద్యోగుల డిమాండ్ ను నెరవేర్చే అవకాశాలు లేవని తేలిపోయింది. ఇక మిగిలింది గతంలో ప్రకటించిన 27 శాతం ఐఆర్ కు మించి ఫిట్ మెంట్ ఇవ్వడమే. కాబట్టి తెలంగాణలో ప్రస్తుతం ఇస్తున్నట్లుగా 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటనలు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఇందులోనూ ఆర్ధిక ఇబ్బందులున్నాయి.

 జగన్ కీలక సూచన

జగన్ కీలక సూచన

పీఆర్సీ ఫిట్ మెంట్ విషయలో పీటముడి పడిన నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపిన అధికారులు, ఆర్ధికమంత్రి బుగ్గన .. నిన్న సీఎం జగన్ తో భేటీ అయ్యారు. వాస్తవ పరిస్ధితిని ఆయనకు కుండ బద్దలు కొట్టేశారు. దీంతో ఎన్ని ఇబ్బందులున్నా ఉద్యోగుల్ని నిరాశపర్చకుండా చూడాలని ఆయన వారికి సూచించారు. దీంతో అధికారులు మరోసారి ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నారు. అదే సమయంలో పీఆర్సీ పై ఉద్యోగుల డిమాండ్లకు, వాస్తవ ఆర్ధిక పరిస్ధితులకూ మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నారు.

ఆలస్యం తప్పదన్న సజ్జల

ఆలస్యం తప్పదన్న సజ్జల


ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులు కోరుతున్న విధంగా 45 శాతం పీఆర్సీ ఇచ్చే పరిస్ధితి లేదు. అలాగని గతంలో ప్రకటించిన 27 శాతం ఐఆర్ కంటే తక్కువగా ఇచ్చినా ఉద్యోగులు ఊరుకునే పరిస్దితి లేదు. అదే సమయంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి కూడా దృష్టిలో ఉంచుకోక తప్పదు. దీంతో వీటి మధ్య సమన్వయం కోసం అధికారులు మరోసారి అధ్యనయం చేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. కాబట్టి పీఆర్సీ ఆలస్యమవుతుందన్నారు. హడావిడిగా ఏదో ఒక ప్రకటన చేసి చేతులు దులుపుకోవడం కంటే సాధ్యమైనంత మెరుగైన ఫిట్ మెంట్ ఇచ్చి ఉద్యోగుల్లో అసంతృప్తి తగ్గించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సజ్జల చెప్తున్నారు. దీంతో పీఆర్సీ పై ప్రకటన మరింత ఆలస్యం కానుందని తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు కొత్త సంవత్సరంపైనే ఆశలు పెట్టుకున్నారు.

English summary
ap government has clarified that more delay in employees prc annoucment with financial reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X