కాకినాడ మేయర్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, పదవిపై సస్పెన్స్
కాకినాడ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
కాకినాడ: కాకినాడ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
చదవండి: 30 ఏళ్ల తర్వాత టిడిపి చరిత్ర: మేయర్ రేసులో కాపు మహిళలు వీరే!
ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 12 లోగా ఆయా డివిజన్లలో గెలుపొందిన అభ్యర్థులందరికీ నోటీసులు ఇవ్వాలని, వారందర్నీ సమావేశపరచి మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోవాల్సి ఉంది.

16న మేయర్, డిప్యూటీ మేయర్‌లతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇటీవల జరిగిన కాకినాడ కార్పొరేషన్ పరిధిలోని 48 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టిడిపి 32, బిజెపి 3, వైసిపి 10, ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందిన విజయం తెలిసిందే. టిడిపి ఎవరిని మేయర్‌గా చేస్తుందనే సస్పెన్స్ అందరిలోను నెలకొంది.












Click it and Unblock the Notifications