కత్తి మహేష్ వ్యాఖ్యలపై...సెల్ టవరెక్కిన పవన్ అభిమాని...

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu
  పవన్ కల్యాణ్‌పై పోటీ చేస్తా : నడిరోడ్డు మీద కాల్చి చంపినా తప్పులేదు పై మహేష్ కత్తి !

  విజయవాడ: జనసేన పవన్‌కల్యాణ్‌పై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై మనస్తాపం చెందిన పవన్ అభిమాని ఒకరు సెల్ టవర్ ఎక్కాడు. తణుకు మండలం పైడిపర్రు చెందిన సిరిమళ్ల జ్యోతికృష్ణ అనే యువకుడు పవన్‌పై వస్తున్న వ్యాఖ్యలకు ఈ విధంగా నిరసన వ్యక్తం చేశాడు.

  సెల్ టవర్ ఎక్కిన జ్యోతికృష్ణను సమదాయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కిందకు దించే ప్రయత్నంలో జ్యోతికృష్ణతో ఫోన్‌ ద్వారా మాట్లాడేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అతని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. సెల్‌టవర్ వద్దకు భారీగా ప్రజలు చేరుకుంటున్నారు.

  Pawan-Mahesh Kathi

  పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో పాటు ఇటీవలే తనను దుమ్మెత్తిపోసిన నటి పూనమ్ కౌర్ కు సినీ విమర్శకుడు కత్తి మహేష్ ప్రెస్ మీట్ పెట్టి మరీ కొన్ని ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే.

  తనకు పవన్ ఫ్యాన్స్ కు మధ్య ఉన్న వివాదం ముగిసి పోవాలంటే పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుంటేనే సాధ్యమని సినీ విమర్శకుడు కత్తి మహేష్ వాదిస్తున్నాడు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Jana Sena chief Pawan Kalyan fan in protest against Mahesh Kathi comments climbed cell tower.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి