తిరుపతి ఎక్స్ప్రెస్ ఇకపై..
తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు రైల్వే అధికారులు శుభవార్త అందించారు. రైళ్ల రాకపోకలను మరింత మెరుగుపర్చే దిశగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తిరుపతి- రామేశ్వరం మధ్య రాకపోకలు సాగించే ఎక్స్ ప్రెస్ ఫ్రీక్వెన్సీని పెంచారు. అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన తిరుపతి రూట్ లో వేలాదిమంది భక్తులు, ఇతర ప్రయాణికులకు రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో ఈ తాజా చర్యలు తీసుకున్నారు.
తిరుపతి- రామేశ్వరం మధ్య నడిచే మీనాక్షి ఎక్స్ ప్రెస్ ఇకపై వారంలో నాలుగు రోజుల పాటు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మూడు రోజుల పాటు మాత్రమే రాకపోకలు సాగిస్తూ వస్తోంది. చాలాకాలంగా ఉన్న డిమాండ్ ఇది. తమిళనాడు చిట్టచివరి ప్రాంతం నుంచీ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుపతికి నేరుగా రైలు కనెక్టివిటీ కల్పించే ఎక్స్ ప్రెస్ ఇది. ప్రయాణికుల నుంచి అంచనాలకు మించిన ఆదరణ ఉండే రైలు ఇది.

దీని ఫ్రీక్వెన్సీని పెంచాలని, వారంలో నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికుల నుండి పలు విజ్ఞప్తులు అందాయి. వీటిపై రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై తాజాగా రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. మార్చి 3వ తేదీ నుంచి ఈ ఎక్స్ ప్రెస్ వారంలో నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.
నంబర్ 16780 రామేశ్వరం - తిరుపతి ఎక్స్ప్రెస్ ప్రస్తుతం గురు, శుక్ర, ఆదివారాల్లో నడుస్తోంది. కొత్తగా మంగళవారం కూడా తోడైంది. మార్చి 3 నుంచి ప్రతి మంగళ, గురు, శుక్ర, ఆదివారాల్లో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా నంబర్ 16779 తిరుపతి - రామేశ్వరం ఎక్స్ప్రెస్ మార్చి 4 నుండి సోమ, బుధ, శుక్ర, శనివారాల్లో రాకపోకలు సాగిస్తుంది. ప్రస్తుతం సోమ, శుక్ర, శనివారాల్లో అందుబాటులో ఉంటోంది. కొత్తగా బుధవారం వచ్చి చేరింది.
మార్చి 3 నుంచి ప్రతి మంగళ, గురు, శుక్ర, ఆదివారాల్లో సాయంత్రం 4:55 నిమిషాలకు రామేశ్వరం నుండి బయలుదేరే నంబర్ 16780 ఎక్స్ప్రెస్ మరుసటి రోజు ఉదయం 10:10 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది.
మార్చి 3 నుంచి ప్రతి సోమ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 11:55 నిమిషాలకు తిరుపతి నుండి బయలుదేరే నంబర్ 16779 ఎక్స్ ప్రెస్ మరుసటి రోజు తెల్లవారు జామున 4:35 నిమిషాలకు రామేశ్వరానికి చేరుకుంటుంది.
మండపం, రామనాథపురం, పరమక్కుడి, మనమధురై, మధురై, కొడైకెనాల్ రోడ్, డిండిగల్, తిరుచిరాపల్లి, తంజావూరు, కుంభకోణం, మైలాడుథురై, సర్కాజీ, చిదంబరం, తిరుపాద్రిపులియూర్, విల్లుపురం, తిరువణ్ణామలై, పోలూర్, ఆరణి రోడ్, వేలూరు కంటోన్మెంట్, కాట్పాడి, పాకాల మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
-
తమిళనాడు టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరలో.. ఇలా చేయండి..! -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ ముఖ్య గమనిక -
తిరుమలలో విశేషం: గోవిందుడి నామస్మరణ మధ్య.. !! -
తిరుమలలో శ్రీవారి సేవలు మూడురోజుల పాటు రద్దు -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ












Click it and Unblock the Notifications