వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్ర మంత్రి వ్యాఖ్యలకు తెరాస మద్దతు, టిడిపి నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balaraju
హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రి బాలరాజు వ్యాఖ్యలపై బుధవారం శాసన సభలో గందరగోళం ఏర్పడింది. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన సభలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. బిల్లు పైన అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని బాలరాజు ప్రకటించినప్పుడు గందరగోళం ఏర్పడింది. ఓసారి సభ వాయిదా పడింది.

బిల్లుపై చర్చలో మాట్లాడుతూ... విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ అభిప్రాయానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. దాంతో ఆయనను సీమాంధ్ర ద్రోహి అంటూ సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. వారికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులు నినాదాలు చేస్తూ బాలరాజుకు మద్దతుగా నిలబడ్డారు. సభలో గందరగోళం ఏర్పడటంతో సభాపతి సభను ఐదు నిమిషాలు వాయిదా వేశారు.

అనంతరం సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. సీమాంధ్ర టిడిపి శాసన సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. పోటీగా తెరాస ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలు బాలరాజుకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఈటెల వ్యాఖ్యలపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈటెల ఆగ్రహంతో ఖబడ్దార్.. బీ కేర్ ఫుల్ అంటూ సీమాంధ్ర టిడిపి నేతలను హెచ్చరించారు.

English summary

 Seemandhra Minister Balaraju on Wednesday said he will obey Congress Party High Command's decision on Telangana Draft Bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X