కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరీంనగర్‌లో 10 ఎకరాల్లో శ్రీవారి ఆలయం నిర్మాణం: తిరుమలలో అద్దె పెంచలేదు!

|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు 6.06 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించినట్టు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రతి ఒక్కరికీ శ్రీవారి ఆశీస్సులు

ప్రతి ఒక్కరికీ శ్రీవారి ఆశీస్సులు

హిందువులకు ముఖ్య పండుగైన సంక్రాంతి సందర్భంగా శ్రీవారి ఆశీస్సులతో భక్తులు పాడిపంటలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికీ స్వామివారి కరుణాకటాక్షాలు నిండుగా అందాలని ఆశిస్తున్నాను అని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

- సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 15న తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల మైదానంలో గోదాకల్యాణం నిర్వహిస్తాం.
- తిరుమల నాదనీరాజన వేదికపై జనవరి 2వ తేదీ నుంచి గరుడ పురాణం ప్రవచనాలు ప్రారంభించాం.
- జనవరి 1న తిరుమలలోని పిఏసి4(పాత అన్నదాన భవనం)లో అన్నప్రసాద వితరణ ప్రారంభించాం.
వైకుంఠ ద్వార దర్శనం :
- తిరుపతిలో 9 ప్రాంతాల్లో, తిరుమలలోని ఒక ప్రాంతంలో దాదాపు 100 కౌంటర్లు ఏర్పాటుచేసి భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు విరివిగా లభ్యమయ్యేలా చర్యలు తీసుకున్నాం.
- రోజుకు 20 వేలు చొప్పున ఎస్‌ఇడి టికెట్లు, 50 వేలు చొప్పున ఎస్‌ఎస్‌డి టోకెన్లు జారీ చేశాం.
- దర్శన టోకెన్‌ లేకపోతే క్యూలైన్లు పెరిగిపోయి భక్తులు చలికి ఇబ్బందిపడతారనే ఉద్దేశంతో టోకెన్లు ఉన్నవారికే దర్శనం కల్పించాం.
వెనుకబడిన పేదవర్గాల భక్తులకు దర్శనం :
- వెనుకబడిన పేదవర్గాల భక్తులకు టిటిడి రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సమయంలో ఉచితంగా రవాణ, వసతి, భోజనంతోపాటు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం.
- శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లోని 190 ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకార గ్రామాల నుంచి సుమారు 9300 మంది భక్తులకు జనవరి 3 నుంచి 9వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాం అని టీటీడీ ఈవో వివరించారు.

తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు :

తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు :

జనవరి 28న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాం.

- ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు ఒకేరోజు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. చక్రస్నానం నిర్వహిస్తాం.
- వాహనసేవలను వీక్షించేందుకు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, కాఫీ, టి, పాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో వెల్లడించారు.

శ్రీవాణి దర్శన టికెట్ల తగ్గింపు :

శ్రీవాణి దర్శన టికెట్ల తగ్గింపు :

- 2019లో శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్టు(శ్రీవాణి) ప్రారంభించాం. లక్ష రూపాయల లోపు విరాళం అందించే దాతలకు కూడా ప్రయోజనాలు వర్తింపచేయాలని టిటిడి నిర్ణయించింది. తదనుగుణంగా రూ.10 వేలు విరాళం అందించే దాతలకు ఒక బ్రేక్‌ దర్శన టికెట్‌ జారీ చేస్తున్నాం. ఈ ట్రస్టు నిధులతో పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం, ఆలయాల ధూపదీప నైవేద్యాలకు ఆర్థికసాయం అందిస్తున్నాం. అయితే ఆదాయం కోసమే శ్రీవాణి దర్శన టికెట్లు ఇస్తున్నారని కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.

- మరింత ఎక్కువమంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా శ్రీవాణి ట్రస్టు దాతలకు ఇచ్చే బ్రేక్‌ దర్శన టికెట్లను 1000కి తగ్గించడం జరిగింది. ఇందులో 750టికెట్లు ఆన్‌లైన్‌లో, 250 టికెట్లు ఆఫ్‌లైన్‌లో విడుదల చేయడం జరుగుతోందని తెలిపారు.

జనవరి 15 నుంచి సుప్రభాతం తిరిగి ప్రారంభం :

జనవరి 15 నుంచి సుప్రభాతం తిరిగి ప్రారంభం :

ధనుర్మాసం కారణంగా డిసెంబరు 17వ తేదీ నుంచి తిరుమల శ్రీవారికి సుప్రభాత సేవ స్థానంలో నిర్వహిస్తున్న తిరుప్పావై జనవరి 14న ముగియనుంది. జనవరి 15వ తేదీ నుంచి సుప్రభాతం సేవ పున:ప్రారంభం కానుందని తెలిపారు.

తిరుమలలో సామాన్య భక్తులు బస చేసే గదుల అద్దె పెంచలేదు

తిరుమలలో సామాన్య భక్తులు బస చేసే గదుల అద్దె పెంచలేదు

తిరుమలలో సుమారు 7,500 గదులు ఉన్నాయి. ఇందులో 75 శాతం ఉన్న 5 వేలకు పైగా గదులు సామాన్య భక్తులకు కేటాయిస్తున్నాం. వీరు బస చేసే కాటేజిల అద్దె పెంచలేదు. సామాన్య భక్తులు బస చేసే రూ.50/, రూ.100/అద్దె గదులను రూ.120 కోట్లతో ఆధునీకరించాం.

- విఐపిల కోసం కేటాయించే గదులలో అద్దె వ్యత్యాసం లేకుండా చేసేందుకే ఎస్వీ గెస్ట్‌హౌస్‌, స్పెషల్‌ టైప్‌, నారాయణగిరి విశ్రాంతి గృహాలలోని 172 గదులను భక్తుల సూచనల మేరకు ఆధునీకరించి, అక్కడి వసతులకు అనుగుణంగానే గదుల అద్దె నిర్ణయించడం జరిగింది.
- ఈ విశ్రాంతి గృహాల్లో దాదాపు 22 ఏళ్ల క్రితం అప్పటి వసతులకు అనుగుణంగా గదుల అద్దెను టిటిడి నిర్ణయించింది. భక్తుల అభిమతానుసారం నూతన ఫర్నీచర్‌, ఏసి, వేడి నీటి కోసం గీజర్లు తదితర వసతులు కల్పించడం జరిగింది. వాస్తవాలు పూర్తిగా తెలుసుకోకుండా దురుద్దేశపూర్వకంగా కొన్ని ప్రచార, ప్రసార, సామాజిక మాధ్యమాలు, కొందరు వ్యక్తులు గదుల అద్దె భారీగా పెంచేశామని టిటిడిపై బురదజల్లే ప్రయత్నం చేయడం దురదృష్టకరం.
- ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి సూచించారు.

కరీంనగర్‍‌లో 10 ఎకరాల్లో శ్రీవారి ఆలయం: టీటీడీ

కరీంనగర్‍‌లో 10 ఎకరాల్లో శ్రీవారి ఆలయం: టీటీడీ

కరీంనగర్‌లో పది ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవాణి ట్రస్టుకు ఇచ్చే విరాళాలతో వెనుకబడిన ప్రాంతాలలో ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ చేస్తున్నామని తెలిపారు. లక్ష రూపాయల కంటే తక్కువ విరాళం ఇచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శన సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్ల విధానంతో దళారీ వ్యవస్థను అరికట్టగలిగామని చెప్పారు. పది రోజుల్లో 6.09 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తే.. హుండీ ద్వారా రూ. 39.4 కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు.

English summary
Srivari temple will built in Karimnagar: TTD.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X