తండ్రీ, కొడుకుల అనుబంధం

వ్యక్తిగా, వృత్తిపరంగా తన తండ్రి కృష్ణను మహేష్ బాబు ఎంతగానో ఆరాధించేవారు. నాన్నే నా దేవుడు అని చెబుతుండేవారు. మహేష్ బాబు అంతగా ప్రేమించే తండ్రి దూరమయ్యారు. కార్డియాక్‌ అరెస్టుకు గురైన కృష్ణ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు కృష్ణతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

పలు సందర్భాల్లో తన తండ్రి గురించి మహేష్ బాబు చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కృష్ణ, మహేష్ బాబు నటించిన చిత్రాలను పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోలో ''కృష్ణగారి అబ్బాయి అనే నేను'' అంటూ మహేష్ బాబు మాట్లాడిన మాటలు, 'మురారి' సినిమా చూశాక నాన్న నా భుజంపై చేయి వేశారని, ఏమీ మాట్లాడలేదని, అప్పుడు నా నటన నాన్నకు అర్థమైందని తెలిసిందని, అప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగినట్లు ప్రిన్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో వైరలవుతోంది. ఈ వీడియోలు అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి.

Mahesh Babu adored his father Krishna as a person and professionally.

కృష్ణ తన కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబులను బాల నటులుగా పరిచయం చేశారు. తన సినిమాల్లోనే వారికి అవకాశం ఇచ్చి వారిలోని ప్రతిభను అందరికీ తెలిసేలా చేశారు. కొడుకు దిద్దిన కాపురం, గూఢచారి 117, అన్న-తమ్ముడు, బజారు రౌడి, శంఖారావం, పోరాటం, అల్లూరి సీతారామరాజు, మనుషులు చేసిన దొంగలు, అన్న దమ్ముల సవాల్ తదితర చిత్రాల్లో నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+