వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెస్క్యూ హోంలో: బంధువులొస్తే శ్వేతబసుకు విముక్తి?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: బంధువులు లేదా కటుంబ సభ్యులు ఎవరైనా వస్తే కొత్త బంగారు లోకం సినిమా హీరోయిన్ శ్వేతాబసుకు రెస్క్యూ హోం నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. రెస్క్యూ హోంలో ఆమె మూడు నెలల పాటు ఉండాల్సి ఉంది. అయితే, బంధువులు ఎవరైనా వస్తే మాత్రం ముందుగానే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.

హైదరాబాద్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సినీ హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ మహిళా పునరావాస కేంద్రంలో విశ్రాంతి తీసుకుంటోంది. కోర్టు ఆదేశాల మేరకు ఆమెను పోలీసులు ఆ కేంద్రంలో ఉంచారు. సాధారంగా ప్రభుత్వ రెస్క్యూ హోంలో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన మహిళలను, అనాథలను మాత్రమే ఉంచుతారు.

Swetha Basu has chance to leave
హీరోయిన్‌గా ఎంతో లగ్జరీని అనుభవించిన శ్వేతా బసు ప్రసాద్‌ ఇప్పుడు రెస్క్యూ హోంలో సేద తీరుతోంది. శ్వేత బసు ప్రసాద్‌ని పునరావాస కేంద్రంలో వుంచాలని ఎర్రమంజిల్ కోర్టు ఆదేశించిన తర్వాత పోలీసులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేసిన తర్వాత కేంద్రానికి తరలించారు.

కాగా, శ్వేత బసు పట్ల మీడియా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె పట్ల జాలి పెరుగుతోంది. శ్వేతాబసు పేరు మాత్రమే మీడియాలో వస్తోందని, కానీ, ఈ వ్యవహారంలో ఉన్న వ్యాపారవేత్తల పేర్లు మాత్రం బయటికి రావడం లేదని టీవీ నటి సాక్షి తన్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు మాత్రం గౌరవమర్యాదలుండవా, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదా అన్ని ప్రశ్నించారు. శ్వేతాబసు తనతోపాటు సీరియల్‌లో నటించినప్పుడు తొమ్మిదేళ్ల అమ్మాయి అని, ఎంతో ప్రతిభావంతురాలని సాక్షి ప్రశంసించింది.

శ్వేతా బసు గురించి హిందీ టీవీ నటి సాక్షి తన్వర్ సంధించిన ప్రశ్నలకు తెలుగు సినీ దర్శకుడు రాజమౌళి తన మద్దతు ప్రకటించారు. తన్వర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఉందా? అంటూ ఆయన ట్వీట్ చేసారు.

English summary
Telugu actress Swetha Basu Prasad has a chance to get released from rescue home, if her relatives come into rescue of her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X