చంద్రబాబుతో భేటీకి గంటా డుమ్మా-వైసీపీలో చేరికపై పుకార్లకు మరింత ఊతం-ఇక తేల్చేస్తారా ?
ఏపీలో భారీ మెజారిటీతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్రమంలో 23 మంది ఎమ్మెల్యేలకే టీడీపీ పరిమితమైనా ఆ గాలిలోనూ గెలిచిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో పార్టీలో మరో ముగ్గురు ఎమ్మెల్యేల తరహాలోనే ఆయన వైసీపీకి దగ్గరవుతారా లేక నేరుగా చేరిపోతారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. అయితే ఎప్పటికప్పుడు ఈ వ్యవహారంపై మౌనం పాటిస్తున్న గంటాపై ఏదో ఒకటి తేల్చేయాలని అధినేత చంద్రబాబు భావించినా ఇవాళ కూడా సాధ్యం కాలేదు.

చంద్రబాబు భేటీకి గంటా డుమ్మా
ఏపీలో
మరో
రెండేళ్లో
సార్వత్రిక
ఎన్నికలు
జరగనున్న
తరుణంలో
ఇప్పటి
నుంచే
పార్టీని
సిద్ధం
చేయడంపై
దృష్టిపెట్టిన
చంద్రబాబు..
ఎమ్మెల్యేలు
ఉన్న
చోట
వారిని,
లేని
చోట్ల
ఇన్
ఛార్జ్
లకు
బాధ్యతలు
అప్పగించాలని
నిర్ణయించారు.
ఈ
క్రమంలో
ఎమ్మెల్యేగా
ఉంటూ
పార్టీ
కార్యక్రమాలకు
దూరంగా
ఉంటున్న
గంటా
శ్రీనివాసరావును
మిగతా
ఇన్
ఛార్జ్
లతో
పాటు
ఇవాళ
భేటీకి
ఆహ్వానించారు.
అయితే
ఇవాళ
వస్తానని
సమాచరమిచ్చిన
గంటా
శ్రీనివాసరావు
చివరి
క్షణంలో
డుమ్మా
కొట్టారు.
దీంతో
గంటా
లేకుండానే
మిగతా
పార్టీ
నేతలతో
చంద్రబాబు
భేటీని
ముగించారు.

త్వరలో కలుస్తానని సమాచారం
ఇవాళ
చంద్రబాబు
ఏర్పాటు
చేసిన
భేటీకి
ఆహ్వానించినా
డుమ్మా
కొట్టిన
గంటా
శ్రీనివాసరావు..
త్వరలో
వచ్చి
కలుస్తానని
చెప్పినట్లు
తెలుస్తోంది.
అయితే
కీలక
భేటీకి
రాకుండా
ఉండిపోయిన
గంటా
శ్రీనివాస్
పై
పార్టీ
వర్గాల్లో
ఆగ్రహం
వ్యక్తమవుతున్నట్లు
సమాచారం.
అధినేత
అయిన
చంద్రబాబుతో
భేటీకి
ఆహ్వానించినా
రాకుండా
డుమ్మా
కొట్టేంత
పనులు
ప్రస్తుతం
గంటాకు
ఏమున్నాయన్న
దానిపై
పార్టీ
నేతల్లో
చర్చ
జరుగుతోంది.
దీంతో
గంటా
వ్యవహారంపై
పార్టీలో
చర్చించి
ఏదో
ఒక
నిర్ణయం
తీసుకునేందుకు
సిద్దమవుతున్నట్లు
తెలుస్తోంది.

వైసీపీలో చేరిపోతారా ?
మరోవైపు వైసీపీలో చేరికపై రెండేళ్లుగా లీకులు ఇస్తూ వస్తున్న గంటా శ్రీనివాసరావు, అందుకోసం కొన్ని షరతులు పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ నేతలు కూడా సీఎం జగన్ తో గంటా భేటీకి పలుమార్లు ఏర్పాటు చేసి కూడా చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తిరిగి చంద్రబాబుతో భేటీ అయితే ప్రతికూల సంకేతాలు వెళ్తాయని భావించి గంటా వెనక్కి తగ్గి ఉండొచ్చని తెలుస్తోంది. అదే నిజమైతే త్వరలో వైసీపీకి ఈయన గంట కొట్టడం ఖాయమేనన్న ప్రచారం జరుగుతోంది. వైజాగ్ లో పార్టీ బలోపేతంపై దృష్టిపెడుతున్న వైసీపీ. గంటాను తీసుకుంటే ఆ మేరకు నాయకత్వ సమస్య తీరుతుందనే అంచనాలో కూడా ఉంది. దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.