విషాదం: పెళ్లి చూపుల ఫోటోకు వెళ్తూ టెక్కీ మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూలు: బెంగళూరులోని ఒరికిల్ కంపెనీలో సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతని సొంతూరు వేంపెట. బావ లక్ష్మన్నతో కర్నూలులో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తూ టెలికాం నగర్లో ఉంటున్నారు.

శనివారం ఉదయం బెంగళూరు నుంచి తెల్లవారుజామున జగన్మోహన్ రెడ్డి తన బావ ఇంటికి వ చ్చాడు. పెళ్లి చూపులకు సంబంధించి ఫోటోలు దిగేందుకు సాయంత్రం బావతో కలిసి బైక్ పైన వెళ్తున్నాడు.

 Techie dead in road accident in Kurnool district

లక్ష్మన్న వాహనం నడుపుతుండగా జగన్మోహన్ రెడ్డి బైక్ పైన కూర్చున్నాడు. వారు పాత ఆర్టీవో కార్యాలయం వద్దకు వెళ్లగానే వెనుక నుంచి లారీ వచ్చి గట్టిగా ఢీకొంది. వారు కింద పడ్డారు.

ఉన్మాదం: ప్రేమించలేదని నిశ్చితార్థానికి ముందు రోజు చంపేశాడు

జగన్మోహన్ రెడ్డి తలకు బలమైన గాయమైంది. దీంతో అతను అక్కడికి అక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, ప్రమాదం సాక్ష్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Techie dead in road accident in Kurnool district on Saturday.
Please Wait while comments are loading...