వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేనలో హోదాల్లేవు, పవన్ కళ్యాణ్‌కు కూడా?: 2019 వీరికీ టిక్కెట్

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో కార్యకర్తలు తప్ప నేతలు ఉండరనే సంకేతాలు వెలువడుతున్నాయి. కార్యకర్తల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న జనసేన.. పార్టీ నిర్మాణంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

|
Google Oneindia TeluguNews

అనంతపురం: పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో కార్యకర్తలు తప్ప నేతలు ఉండరనే సంకేతాలు వెలువడుతున్నాయి. కార్యకర్తల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న జనసేన.. పార్టీ నిర్మాణంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

ప్రజా సమస్యలను ప్రశ్నించడమే లక్ష్యంగా చెబుతున్న జనసేనలో నాయకులకు చోటు లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం పనిచేసే వారికి ఎటువంటి హోదాలు ఇవ్వరు. చివరికి పవన్ కళ్యాణ్‌కు కూడా ఎలాంటి హోదా ఉండదని అంటున్నారు.

<strong>'పవన్‌తో అందుకే మాటలు, జగన్-బాబులు మోడీతో భేటీ వెనుక ఇదీ'</strong>'పవన్‌తో అందుకే మాటలు, జగన్-బాబులు మోడీతో భేటీ వెనుక ఇదీ'

ఆయా జిల్లాల్లోనూ ఎవరికీ ఎలాంటి పదవులు ఉండవంటున్నారు. పార్టీలో అందరూ జన సైనికులే. ప్రస్తుతం ఎంపిక ప్రక్రియ జోరుగా సాగుతోంది.

2019లో టిక్కెట్ వీరిలోను టిక్కెట్

2019లో టిక్కెట్ వీరిలోను టిక్కెట్

ప్రస్తుతం ఎంపిక చేస్తున్న వారిలో చురుకైన వారికి 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశముందని అంటున్నారు. పార్టీ నిర్వహిస్తున్న పరీక్షల్లో ఎంపికైన వారితో పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడుతున్నారు. ఇలా ఎన్నికైన వారు ఆయా జిల్లాల పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారు.

జన'సేన' ఎంపిక

జన'సేన' ఎంపిక

కాగా, జనసేన పార్టీ కార్యకర్తల ఎంపిక ప్రక్రియ శనివారం కొనసాగింది. ద్వారకానగర్‌ శ్రీకృష్ణ విద్యామందిర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి అధిక సంఖ్యలో యువత చేరుకుని, పేర్లు నమోదు చేసుకున్నారు.

శుక్ర, శనివారం నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో 3,279 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, పోటీ పరీక్షలు రాశారు. ఎనలిస్ట్‌, కంటెంట్‌ రైటర్‌, స్పీకర్‌ విభాగాల్లో అభ్యర్థులు పోటీ పడ్డారు.

పవన్ ద్వారా న్యాయం

పవన్ ద్వారా న్యాయం

జనసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజలు మార్పు కోరుతున్నారని, పవన్‌ కళ్యాణ్ ద్వారా తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం వారిలో పెరుగుతోందన్నారు. త్వరలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా కార్యకర్తల ఎంపిక ప్రక్రియ చేపడతామన్నారు.

రాయడానికి వీరు కూడా..

రాయడానికి వీరు కూడా..

ఓ గర్భిణి రైటర్‌గా పరీక్ష రాయడానికి శిబిరం వద్దకు రాగా, దివ్యాంగుడైన యువకుడు కంటెంట్‌ రైటర్‌ కావడానికి వచ్చారు. రాష్ట్రంలో ప్రయివేటు ఆసుపత్రులను ప్రోత్సహించడం, వైద్యాన్ని ప్రయివేటీకరించడం అనే అంశాలపై వ్యాసాలు రాశారు.

English summary
It is said that there is no posts in Jana Sena party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X